రేవంత్ సహా ఎవరూ మాట్లాడలేదు, సూర్యాపేటలో బరిలో ఉంటా: కాంగ్రెస్ రెబల్ పటేల్ రమేష్ రెడ్డి

By narsimha lode  |  First Published Nov 15, 2023, 10:56 AM IST

సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో  పటేల్ రమేష్ రెడ్డి  వ్యవహరం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.  టిక్కెట్టు రాకపోవడంతో  ఆలిండియా పార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధిగా పటేల్ రమేష్ రెడ్డి బరిలో నిలిచారు.  తాను  బరిలో కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు. 


సూర్యాపేట:  తాను  సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి బరిలో ఉంటానని  కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి పటేల్ రమేష్ రెడ్డి తేల్చి చెప్పారు. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును పటేల్ రమేష్ రెడ్డి ఆశించారు. అయితే  పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించలేదు.  సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో   సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని  సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. అయితే  ఇదే స్థానం నుండి  పటేల్ రమేష్ రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును ఆశించారు. 2018 ఎన్నికల సమయంలో కూడ ఇదే స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ టిక్కెట్టు కోసం  ప్రయత్నించారు. అయితే  చివరి నిమిషంలో  రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  

అయితే  పటేల్ రమేష్ రెడ్డి  నామినేషన్ దాఖలు చేశారు.ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధిగా  సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి బరిలో నిలిచారు. తాను బరిలో ఉంటానని రమేష్ రెడ్డి తేల్చి చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడ తనతో సంప్రదింపులు జరపలేదని  పటేల్ రమేష్ రెడ్డి  ఓ మీడియా న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Latest Videos

undefined

2014, 2018 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై  బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  గుంటకంట్ల జగదీష్ రెడ్డి విజయం సాధించారు.  మరోసారి ఈ ఇద్దరు అభ్యర్ధులు బరిలో నిలిచారు. 

రేవంత్ రెడ్డితో పాటు  టీడీపీ నుండి పటేల్ రమేష్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా  పటేల్ రమేష్ రెడ్డికి పేరుంది.  అయితే  పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు దక్కలేదు. టిక్కెట్టు దక్కలేదని అసంతృప్తితో ఉన్న పటేల్ రమేష్ రెడ్డి  ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఇదిలా ఉంటే  పటేల్ రమేష్  రెడ్డిని పోటీ నుండి విరమించుకొనేలా  చూడాలని  రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ సాయంత్రం మూడు గంటల వరకే గడువు. దీంతో  కాంగ్రెస్ అగ్రనేతలు  ఈ విషయమై కేంద్రీకరించారు.  రాష్ట్రంలో  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న రెబెల్స్ పై  కాంగ్రెస్ నాయకత్వం కేంద్రీకరించింది.

also read:జగదీష్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టిక్కెట్టు ఇవ్వలేదు: కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి సంచలనం

గత ఎన్నికల సమయంలో కూడ  పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించలేదు.  ఈ దఫా కూడ పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు కేటాయించలేదు. రెండు సమయాల్లో  టిక్కెట్టు దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

click me!