ఈ నెల 30వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని స్కూళ్లకు సెలవులు ఉంటుంది. అయితే ఎన్నికల విధుల్లో అధికంగా ఉపాధ్యాయులే పాల్గొంటారు కాబట్టి.. వారంతా ముందు రోజు ఆయా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు రోజు కూడా సెలవు ఉండే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన ఒకే విడతలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ముమ్మరంగా వాహనాల తనిఖీ జరుగుతోంది. ఎన్నికలు నిర్వహిచేందుకు పోలింగ్ బూత్ లను కూడా అధికారులు ఇప్పటికే ఎంపికే చేశారు. అయితే ఈ పోలింగ్ బూత్ లు ఎక్కువగా స్కూళ్లలోనే ఉన్న నేపథ్యంలో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు కూడా వాటికి సెలువులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు...
undefined
తెలంగాణలో జరిగే ఎన్నికల కోసం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అయితే ఎన్నికల ముందు రోజే వారికి ఈవీఎంలు తీసుకోవడం, ఎక్కడ విధులు నిర్వహించాలనే విషయాలను తెలుసుకోవడం, అక్కడికి చేరుకోవడం, తమ బృందంతో సమన్వయం చేసేకోవడం వంటి పనులు ఉంటాయి. అందుకే ముందు రోజు కూడా సెలవు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయ పర్యాటకులతో జాగ్రత్త : కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ విమర్శలు
అయితే అధికారికంగా ఈ సెలవుల విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అధికారులు ప్రకటించాల్సి ఉంది. కాగా.. ఎన్నికలు పూర్తయి రోజు ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి అధికారులకు అప్పగించే సరికి అర్థరాత్రి దాటే అవకాశం ఉంటుందని, అందుకే విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు మరుసటి రోజు అంటే డిసెంబర్ 1వ తేదీన కూడా సెలువు ఇవ్వాలని ప్రబుత్వాన్ని పలు ఉపాధ్యాయుల సంఘాలు కోరాయి.