Counting: కౌంటింగ్ సరళి ఎలా ఉంటుంది? ఎప్పటికల్లా ఫలితంపై అంచనా వస్తుంది?

By Mahesh K  |  First Published Dec 2, 2023, 11:00 PM IST

రేపు తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై ఓ అంచనాకు రావొచ్చు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు రేపటి కోసం సర్వం సిద్ధం చేసి ఉంచారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏరప్ాటు చేయగా.. అందులో హైదరాబాద్‌లోనే 13 ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలవుతుంది.

ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకూ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అంతలోపు పలు రౌండ్‌లలో వెల్లడయ్యే లీడ్‌ లెక్కలు అంచనా వేయడానికి దోహదపడతాయి. ఈ లీడ్, ట్రెయిల్‌తోనే చివరి రౌండ్ ఫలితాలు వెలువడకముందే మధ్యలోనే అంచనాలు స్పష్టంగా ఏర్పడతాయి. అయితే.. ఈ అంచనా రావడానికి రేపు ఏ సమయం పట్టవచ్చు?

Latest Videos

undefined

8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి కావడానికి అరగంట పట్టొచ్చు. ఆ తర్వాత 9.30 గంటలలోపు తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సారి ప్రతి ఈవీఎంను మూడు సార్లు లెక్కించనున్నట్టు, అందువల్ల ఫలితాలు కొంత ఆలస్యం కావొచ్చని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

Also Read: Telangana Election Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్దకు ఏపీ సీఎం జగన్ దూత?

పోలింగ్ కేంద్రాల సంఖ్యపై తుది ఫలితాల వెల్లడికి సమయం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉంటే ఫలితం ఆలస్యం అవుతుంది. సగటున ఒక రౌండ్ లెక్కింపునకు అరగంట పడుతుంది. ఈ లెక్కన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఫలితాల సరళిపై ఓ అంచనా ఏర్పడుతుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఫలితాలపై అంచనా ఏర్పరుచుకుంటారు. అంటే రేపు మధ్యాహ్నం ఒంటిగంట కల్లా ఫలితాలపై ఓ అంచనాకు రావొచ్చు.

click me!