Bandla Ganesh: ఎగ్జిట్ పోల్ కంటే ముందే ‘బండ్ల’ పోల్.. సీఎం ఆయనే: బండ్ల గణేశ్ మనసులో మాట

Published : Dec 02, 2023, 06:48 PM IST
Bandla Ganesh: ఎగ్జిట్ పోల్ కంటే ముందే ‘బండ్ల’ పోల్.. సీఎం ఆయనే: బండ్ల గణేశ్ మనసులో మాట

సారాంశం

బండ్ల గణేశ్ తెలంగాణ ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు తాను ఇవే ఫలితాలను చెప్పానని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని అనుకుంటున్నట్టు వివరించారు.  

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేశ్ ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఇటీవలే ఆయన తెలంగాణ ఎన్నికలపై కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉంటే తాను 7వ తారీఖునే వచ్చి ఉంటానని చెప్పి వైరల్ అయ్యారు. తాజాగా, మరోసారి ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎగ్జిట్ పోల్స్ కంటే బండ్ల గణేశ్ పోల్స్ వచ్చాయని, అందులో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ అని చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తాను చెప్పినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి 76 నుంచి 86 సీట్ల వరకు వస్తాయని చెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 సీట్లు వచ్చాయని, అంతకంటే ఒక్క సీటు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి రావాలని వ్యక్తిగతంగా తన అభిలాష అని వివరించారు.

Also Read: Telangana Election Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్దకు ఏపీ సీఎం జగన్ దూత?

ఇక సీఎం ఎవరు అనే ప్రశ్నపైనా బండ్ల గణేశ్ మాట్లాడారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రాణం పెట్టి కొట్లాడాడని, ఆయనే సీఎం అని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ఎల్బీ నగర్ స్టేడియంలో డిసెంబర్ 9వ తేదీన, సోనియమ్మ పుట్టిన రోజున రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. తాను డిసెంబర్ 7వ తేదీనే అక్కడికి వెళ్లుతానని, దుప్పటి కూడా తీసుకెళ్లుతానని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు