నాపై మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ దాడి చేశారు: ఆసుపత్రి నుండి గువ్వల బాలరాజు డిశ్చార్జ్

By narsimha lode  |  First Published Nov 12, 2023, 3:43 PM IST

అచ్చంపేటలో బారత రాష్ట్ర సమితి,  కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  ఈ దాడిలో గాయపడిన గువ్వల బాలరాజు  ఇవాళ మధ్యాహ్నం  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.



 హైదరాబాద్:తనపై  , తన అనుచరులపై మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగినట్టుగా  అచ్చంపేట  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు.

 ఆదివారంనాడు మధ్యాహ్నం  ఆసుపత్రి నుండి గువ్వల బాలరాజు డిశ్చార్జ్ అయ్యారు.  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన అనుచరులను చంపినంత పనిచేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే  వంశీకృష్ణ  ప్రత్యక్షంగా తనపై దాడిలో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. 

Latest Videos

undefined

నిన్న రాత్రి తన కారును కొందరు అడ్డుకుని తనపై దాడి చేశారని  గువ్వల బాలరాజు  చెప్పారు.ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బతికి బయటపడ్డానని గువ్వల బాలరాజు తెలిపారు.తనను ఎదుర్కొనే శక్తి లేకుండా దాడులు చేస్తున్నారని బాలరాజు  చెప్పారు.రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరైంది కాదన్నారు.తనపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు తాము దాడి చేయలేదని  చెప్పటాన్ని ఆయన తప్పుబట్టారు. 

 ప్రాణం ఉన్నంత వరకు  అచ్చంపేట  ప్రజల కోసం  పోరాడుతానని గువ్వల బాలరాజు  చెప్పారు.అచ్చంపేట ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని  బాలరాజు తెలిపారు.

తనపై తన ప్రత్యర్ధులు దాడులు చేసే అవకాశం ఉందని డీజీపీ సహా  జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు కూడ ఫిర్యాదు చేసినట్టుగా  గువ్వల బాలరాజు  గుర్తు చేశారు.  తనపై దాడి జరిగే అవకాశం ఉందని  10 రోజుల క్రితమే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా బాలరాజు  గుర్తు చేశారు.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి,  తాను  మరోసారి ఎమ్మెల్యే అయితేనే అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని గువ్వల బాలరాజు  చెప్పారు.కాంగ్రెస్ కు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని గువ్వల బాలరాజు  ప్రజలను కోరారు.ప్రజల దీవెనలు, మద్దతున్నంత వరకు  తనకు ఏమీ కాదని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.

యుద్ధరంగంలోకి దిగినందున వెనుకంజ వేయవద్దని బాలరాజు  పార్టీ శ్రేణులను కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇవాళో, రేపో తాను అచ్చంపేటకు రానున్నట్టుగా  ఆయన  చెప్పారు.

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి  కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా చేయాలని  ఆయన ప్రజలను కోరారు. ప్రాణం ఉన్నంత వరకు  రాజకీయాల్లో నుండి తాను తప్పుకోబోనన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు  కేసీఆర్ ఆశయ సాధన కోసం తాను కట్టుబడి పనిచేస్తానన్నారు.  ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఉండాలని బాలరాజు  కోరారు. పగలు, ప్రతీకారాలు తమ సంస్కృతి కాదన్నారు. 

also read:బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నాడు: అచ్చంపేట సీఐపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

శనివారంనాడు రాత్రి  బీఆర్ఎస్ శ్రేణులు నగదును తరలిస్తున్నారనే  ప్రచారంతో  ఓ కారును అడ్డుకొనేందుకు  కాంగ్రెస్ క్యాడర్ ప్రయత్నించింది.ఉప్పునుంతల వద్ద కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా కారు ఆపలేదు.  అచ్చంపేటలో  కాంగ్రెస్ శ్రేణులు కారును ఆపాయి.  అచ్చంపేటలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.  దీంతో ఉద్రిక్తత నెలకొంది.

click me!