తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గానే ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే అవకాశం వుండటంతో జనసేన పార్టీ ఓట్లకు గండిపడే అవకాశాలున్నాయి. అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గాజు గ్లాస్ కాకుండా ఇతర సింబల్స్ కేటాయించడమూ ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే.
తెలంగాణలో జనసేన పార్టీ అంత యాక్టివ్ గా లేదు. అంతేకాదు రాష్ట్రంలో గుర్తింపుపొందిన పార్టీల జాబితాలోనూ జనసేన లేదు. దీంతో ఈ పార్టీ గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం రిజర్వ్ చేయలేదు. ఈ క్రమంలో ఈ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా మారింది.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించింది బిజెపి. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా జనసేనను ఈసీ గుర్తించలేదు. దీంతో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులందరినీ ఈసి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గుర్తించనుంది. వారికి జనసేన గాజు గ్లాస్ గుర్తు కాకుండా ఫ్రీ సింబల్స్ లో ఏదో ఒకదాన్ని కేటాయించనున్నారు.
Read More బిజెపిని వీడతారంటూ జోరుగా ప్రచారం... ఎట్టకేలకు విజయశాంతి క్లారిటీ
హైదరాబాద్ లోని కూకట్ పల్లితో పాటు తాండూరు, నాగర్ కర్నూల్, కోదాడ నియోజకవర్గాలను బిజెపి జనసేనకు కేటాయించింది. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేయనుంది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే జనసేన అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు కూడా వేయించింది. కానీ ఇప్పుడు వీరంతా ఇండిపెండెంట్లుగా మారిపోయారు.
జనసేన అభ్యర్థులు వీరే :
కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి