Rahul Gandhi : ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కున్నారు - బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు..

Published : Nov 26, 2023, 04:35 PM IST
Rahul Gandhi : ధరణి పేరుతో ప్రజల భూములను లాక్కున్నారు - బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు..

సారాంశం

Rahul Gandhi : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ యువత పేపర్ లీకేజీలతో చాలా నష్టపోయిందని అన్నారు. సంగారెడ్డి సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : బీఆర్ఎస్ నాయకులు ధరణి పోర్టల్ పేరుతో ప్రజల భూములు లాక్కున్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలకు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు.

నెలరోజు పాటు డిజిటల్ చెల్లింపులు చేయండి.. ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని అన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం క్యూలో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఏమీ చేయలేదని చెప్పారు.

ఇప్పటికే మీకు 50 ఏళ్లు.. ప్లీజ్ ఇకపై ఒంటరిగా ఉండొద్దు - రాహుల్ గాంధీకి ఓవైసీ సెటైర్లు..

తెలంగాణ యువత పేపర్ లీకేజీలతో చాలా నష్టపోయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాన నరేంద్ర మోడీ కలిసి ప్రజల జేబులో ఉన్న డబ్బును దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే వాటికి ఆమోద ముద్ర వేస్తామని, ప్రజా పాలన అంటే ఏమిటో చూపిస్తామని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!