tummala nageswara rao: నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కోసం... ఎత్తులకు పై ఎత్తులు

By narsimha lode  |  First Published Nov 22, 2023, 12:31 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలను గెలుచుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. దీంతో  ఈ  జిల్లాపై బీఆర్ఎస్ ఫోకస్ ను పెంచింది.


ఖమ్మం:  ఉమ్మడి ఖమ్మం జిల్లా  రాజకీయాలు  విచిత్రంగా ఉన్నాయి.  గత ఎన్నికల్లో  ఒక పార్టీలో  ఉన్న నేతలు ఈ దఫా ఎన్నికల్లో  వేరే పార్టీలో కొనసాగుతున్నారు. ఒకరిపై ఒకరు  సత్తా చూపేందుకు  అస్త్రశస్త్రాలను  ప్రయోగిస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  భారత రాష్ట్ర సమితి  ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో విపక్ష అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ గెలుపొందిన రెండు అసెంబ్లీ స్థానాలు కూడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవే.

Latest Videos

undefined

2018 ఎన్నికల సమయంలో  తెలుగుదేశం, కాంగ్రెస్,  సీపీఐ, తెలంగాణ జనసమితి  కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఒంటరిగా బరిలోకి దిగింది.  

2014 ఎన్నికల తర్వాత  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.  భారత రాష్ట్ర సమితిలో  తుమ్మల నాగేశ్వరరావు చేరారు.  కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన  చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు  పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో  తుమ్మల నాగేశ్వరరావు పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా బరిలోకి దిగారు.  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేశారు. 

also read:ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా  పువ్వాడ అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ తరపున నామా నాగేశ్వరరావు  బరిలోకి దిగారు. నామా నాగేశ్వరరావుపై  పువ్వాడ అజయ్ కుమార్  విజయం సాధించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కోసం  ఆనాడు  తుమ్మల నాగేశ్వరరావు  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  ఖమ్మంతో పాటు జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు.

2018 ఎన్నికలు ముగిసిన తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  నామా నాగేశ్వరరావు  కూడ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.  బారత రాష్ట్ర సమితిలో నామా నాగేశ్వరరావు  చేరారు.  2019 ఏప్రిల్ మాసంలో జరిగిన  పార్లమెంట్ ఎన్నికల్లో  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. అప్పట్లో సిట్టింగ్ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాదని నామా నాగేశ్వరరావుకు  బీఆర్ఎస్ నాయకత్వం కేటాయించింది. 

also read:ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

ఖమ్మం ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వరరావుకు  అప్పటి సిట్టింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి  పోటీ చేసి  తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.  ఈ ఎన్నికల్లో పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని  తుమ్మల నాగేశ్వరరావు భావించారు. కానీ  భారత రాష్ట్ర సమితి  తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో అసంతృప్తికి గురైన  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సూచన మేరకు  పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాకుండా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  ఆయన  బరిలోకి దిగుతున్నారు.

అయితే  నామా నాగేశ్వరరావు   ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నారు.  గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరో వైపు నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం  పనిచేస్తున్నారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు  ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

click me!