సినీ నటి Divya vani:కాంగ్రెస్‌లో చేరిక

By narsimha lodeFirst Published Nov 22, 2023, 9:35 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  అధికారాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ  అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది.  ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తుంది.  సినీ రంగానికి చెందిన పలువురిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి  దివ్యవాణి  బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

 

𝗔𝗰𝘁𝗿𝗲𝘀𝘀 𝗗𝗶𝘃𝘆𝗮𝗩𝗮𝗻𝗶 𝗝𝗼𝗶𝗻𝗲𝗱 𝗖𝗼𝗻𝗴𝗿𝗲𝘀𝘀 𝗣𝗮𝗿𝘁𝘆

ప్రముఖ సినీ నటి దివ్యవాణి.. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Famous film actress Divyavani..
Joined the Congress Party in the presence of AICC in-charge Manik Rao… pic.twitter.com/se8mLjwOjF

— Congress for Telangana (@Congress4TS)

Latest Videos

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో దివ్యవాణి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సినీ నటి దివ్యవాణి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో  అన్ని విషయాలను చెబుతానన్నారు. అయితే ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విషయమై  చంద్రబాబు అప్పట్లో ఆరా తీశారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత  టీడీపీలో కొనసాగుతానని సంకేతాలు ఇచ్చారు.చంద్రబాబుతో భేటీ తర్వాత  పార్టీలో తనకు జరిగిన అవమానాలను  ఆమె  వివరించారు. అయితే పార్టీ నుండి తనను సస్పెండ్ చేసినట్టుగా  సాగిన ప్రచారంతో మనోవేదనకు గురై  పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె అప్పట్లో ప్రకటించారు. ఈ హైడ్రామా సాగిన తర్వాత  తిరిగి టీడీపీకి ఆమె గుడ్ బై చెప్పారు.

also read:N.T.Rama Rao పేరుతో కేసీఆర్: కాంగ్రెస్ ఇందిరా గాంధీ ప్రచారానికి చెక్

టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆమె  బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా  బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పట్లో కొనసాగిన బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కూడ ఆమె సమావేశమయ్యారు. కానీ ఆమె బీజేపీలో చేరలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పటికే  బీజేపీ నుండి  విజయశాంతి కూడ బయటకు వచ్చారు. ఇటీవలే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. . దివ్యవాణి  గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. అయితే తెలంగాణ ఎన్నికల సమయంలో   ఆమె  కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినీ నటిగా ఉన్న దివ్యవాణి  సేవలను  తెలంగాణ ఎన్నికల్లో  కాంగ్రెస్ వినియోగించుకొనే అవకాశం లేకపోలేదు.
 

click me!