దీపావళి పండగ తరువాత తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ (BJP) మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) తెలిపారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేవలం ఐదు నెలల పరిపాలనలో కాంగ్రెస్ (congress) పార్టీ కర్ణాటక (karnataka) రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండత తరువాత తమ పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేయనుందని తెలిపారు.
Delhi earthquake : ఢిల్లీలో మళ్లీ భూకంపం.. ఉత్తర జిల్లాలో కంపించిన భూమి..
undefined
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు ఇక్కడికి రానున్నారని చెప్పారు. ఎంఐఎం (MIM), బీజేపీ (BJP)ఒక్కటే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే తమ పార్టీ ఎంఐఎంతో కలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
UCC : ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానున్న యూనిఫాం సివిల్ కోడ్.. ఎప్పటి నుంచి అంటే..
బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దుష్ఫ్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ లాభపడిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బీఆర్ఎస్ పాలనతో నాశనమైందని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో గడిచిన ఐదు నెలల పాలనలో ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress party) భ్రష్టు పట్టించిందని తీవ్రంగా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.