
Rahul Gandhi : తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం అంతటా ప్రజా కేంద్రీకృత పాలన శకానికి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణలో 2020లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్ లో శనివారం షేర్ చేశారు.
దేశవ్యాప్తంగా దాడులకు ఐఎస్ఐఎస్ ప్లాన్.. గుట్టు రట్టు చేసిన ఎన్ఐఏ...
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రజలకు కనీస హోదా కల్పించేలా రూపొందించినవేనని వీడియోలో రాహుల్ గాంధీ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ వంటి దొరల ప్రభుత్వం తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా మార్పు తెస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కోట్లాది మంది గొంతుల ఆకాంక్షలకు నిదర్శనమని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు కనీస భరోసా కల్పించేలా తమ హామీలు రూపొందించామని అన్నారు.