జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న బిఆర్ఎస్ ను బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలయ్యిందని... అందువల్లే సొంతరాష్ట్రంలో కేసీఆర్ ను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు పోలింగ్ తేదీ వరకు అప్రమత్తంగా వుండాలని... డిల్లీ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో రెండుమూడు రోజుల్లో కాళేశ్వరం కూలిందని తప్పుడు నివేదికలు పంపిస్తారని... దీనిపై ప్రధాన మీడియాలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాల ద్వారా తెలంగాణ ప్రజల ఆలోచనను మార్చే కుట్రలు జరుగుతున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న బిఆర్ఎస్ ను చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలయ్యిందని కేటీఆర్ అన్నారు. అందువల్లే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పకుండా సొంతరాష్ట్రంలోనే కట్టడి చేయాలని బిజెపి, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఈ 15 రోజులు ఏమైనా జరగవచ్చని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బిఆర్ఎస్ నే గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు.
undefined
డిల్లీలోని బిజెపి, కాంగ్రెస్ కార్యాలయాల్లో బిఆర్ఎస్ పై దుష్ప్రచారం చేసే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. స్వపరిపాలన సాగుతున్న రాష్ట్రంలో డిల్లీ నుండి పాలించే రోజులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుందన్నారు. కుట్రపూరిత ప్రచారాలు, హామీలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సూచించారు.
Read More గువ్వల బాలరాజు ఘటన డ్రామాయే .. ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వుంటే ఇవి కామన్ : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
కేటీఆర్ ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. 15 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ అంటున్నారు... అంటే ప్రజలను మభ్యపెట్టడానికో, సెంటిమెంట్స్ రగల్చడానికో బిఆర్ఎస్ ఏదో నాటకం ఆడబోతోందని అర్థమవుతోందన్నారు. ఇప్పటికే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సమయంలో హరీష్ రావు, గువ్వల బాలరాజుపై జరిగిన దాడి విషయంలో కేటీఆర్ లు నాటకాన్ని రక్తికట్టించారని అన్నారు. ఇది సరిపోకపోవడంతో ఇంకేదో చేయబోతున్నారు... దీన్ని కాంగ్రెస్ పై నెట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.