బీఆర్ఎస్‌ కోసం బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది: కుత్బుల్లాపూర్ సభలో మల్లికార్జున ఖర్గే

By narsimha lode  |  First Published Nov 17, 2023, 7:38 PM IST

 
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీపై  ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.


హైదరాబాద్:తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయిందని  అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఎఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  చెప్పారు. 
కేసీఆర్ కు సహకరించేందుకే బీజేపీ పోటి నుండి తప్పుకుందని ఆయన  విమర్శించారు. 

శుక్రవారంనాడు హైద్రాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో  మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అందరి భవిష్యత్తును రాసే గొప్ప బాధ్యతను అంబేద్కర్ కు ఆనాడు నెహ్రు అప్పగించిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. 

Latest Videos

undefined

కేసీఆర్ ఒక్క కుటుంబం కోసం  సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని  మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. అయితే  తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేరలేదన్నారు.

మోడీ ఏనాడూ కూడ నిజాలు చెప్పరని ఆయన చెప్పారు. మోడీకి సోదరుడు   కేసీఆర్ అని ఆయన  విమర్శించారు.మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు  కాంగ్రెస్ ఓటమి పాలు కాదని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని  ఆరోపణలు చేసిన మోడీ ఎందుకు  ఆయనపై చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మోడీ తెచ్చిన ప్రతి బిల్లుకు  కేసీఆర్ మద్దతు పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే  మోడీకి కన్పించదా అని ఆయన అడిగారు. కమీషన్లు దోచుకొని  నాణ్యత లేని ప్రాజెక్టు కట్టారని  ఖర్గే ఆరోపించారు. నాణ్యత లేని కారణంగానే మూడేళ్లకే  ప్రాజెక్టులు కుంగిపోయాయన్నారు.

also read:vijayashanthi:మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ, కాంగ్రెస్‌లో చేరిన రాములమ్మ

బీజేపీ పేదల వ్యతిరేకి.  అందుకే  మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని  ఆయన విమర్శించారు.తెలంగాణ ఏర్పడినప్పుడు  మిగులు బడ్జెట్ ఉందన్నారు.కానీ, కేసీఆర్ సర్కార్ అవలంభించిన విధానాలతో  తెలంగాణలో ప్రతి వ్యక్తిపై  రూ.5 లక్షల అప్పు ఉందని  ఆయన  చెప్పారు.

click me!