Bandi sanjay...జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు రాజకీయాలు: కరీంనగర్ లో ఓటేసిన బండి సంజయ్

Published : Nov 30, 2023, 11:47 AM ISTUpdated : Nov 30, 2023, 11:49 AM IST
Bandi sanjay...జగన్‌తో కేసీఆర్  కుమ్మక్కు రాజకీయాలు: కరీంనగర్ లో ఓటేసిన బండి సంజయ్

సారాంశం

కరీంనగర్ లో  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత  బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ మాజీ సీఎం అవుతారని ఆయన  చెప్పారు.  కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను ఆయన తప్పు బట్టారు. రాయలసీమకు వెళ్లి రోజక్క పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పాడని  బండి సంజయ్ గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో  కేసీఆర్ కుమ్మక్కయ్యాడని ఆయన  ఆరోపించారు.

also read:K. Taraka Rama Rao...ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి: బంజారాహిల్స్‌లో ఓటేసిన కేటీఆర్

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్  భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా  బరిలో నిలిచారు.  2014, 2018 ఎన్నికల్లో కూడ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి  బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి  ఓటమి పాలయ్యాడు.  మూడో దఫా  ఇదే అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేస్తున్నారు . 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన  ఈ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు.  ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తూనే  కరీంనగర్ అసెంబ్లీకి ఆయన  పోటీ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు