కన్నీరు పెట్టించిన బిజెపిని కంగారుపెడుతూ ... బిఆర్ఎస్ చేరేందుకు సిద్దమైన తుల ఉమ?

By Arun Kumar P  |  First Published Nov 12, 2023, 8:08 AM IST

చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేేసి తనతో కన్నీరు పెట్టించిన భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చేందుకు తుల ఉమ సిద్దమయ్యారు. ఆమె నిర్ణయం ఎలావుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


వేములవాడ : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కంటే ఎక్కువ ట్విస్టుల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, నామినేషన్ల వేళ ప్రకటనలు ఆయా పార్టీల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఒకరికి సీటు ఇచ్చి మరొకరికి భీఫారం ఇవ్వడం, చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం వంటి ఘటనలెన్నో చోటుచేసుకున్నారు. ఇలా తమకు చివరినిమిషం వరకు టికెట్ ఆశచూపి మొండిచేయి చూపించిన పార్టీలను దెబ్బతీసేందుకు అసంతృప్త నేతలు సిద్దమయ్యారు. ఇలా వేములవాడ బిజెపి అసంతృప్త నాయకురాలు తుల ఉమ తనకు సీటివ్వని పార్టీకి షాకిచ్చేందుకు సిద్దమయ్యారు.

కరీంనగర్ మాజీ జడ్పి ఛైర్ పర్సన్ తుల ఉమ వేములవాడ టికెట్ ఆశించారు. అయితే బిజెపి అభ్యర్థుల లిస్ట్ లో మొదల వేములవాడ నుండి ఉమ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో బిజెపి బీఫారం మాత్రం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు దక్కింది. నామినేషన్ల చివరిరోజు వరకు సీటు తనదేనని భావించిన ఉమకు బిజెపి షాకిచ్చింది. 

Latest Videos

undefined

తనకు షాకిచ్చిన బిజెపికి షాక్ ఇచ్చేందుకు తుల ఉమ సిద్దమయ్యారు. ఈటల రాజేందర్ తో కలిసి బిజెపిలో చేరిన ఆమె తాజా పరిణామాలతో తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ తుల ఉమ బిజెపిని వీడి బిఆర్ఎస్ లో చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు వేములవాడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  

Read More  బీజేపీకి మ‌రో షాక్.. టికెట్ నిరాకరించడంతో ములుగు నేత తాటి కృష్ణయ్య రాజీనామా

ఇప్పటికే తుల ఉమ సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆమెతో ఫోన్ లో మాట్లాడినట్లు... తిరిగి బిఆర్ఎస్ లో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారట. ఇప్పటికయితే బిఆర్ఎస్ అభ్యర్థిని గెలుపుకు కృషి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ పై కేటీఆర్ హామీ ఇవ్వడంతో తుల ఉమ బిజెపికి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

తుల ఉమతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా మంతనాలు జరిపారు. ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథ్, వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్ లు ఉమను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కానీ కేటీఆర్ హామీతో ఆమె బిఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే తుల ఉమ తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు బిఆర్ఎస్ వర్గాల సమాచారం. 

click me!