ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ కొడుకుతో పాటు కూతురు కూడా ఆశిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కావాలనే కోరిక వుందా? అన్న ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు.
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి పదవికోసం వివాదం రాజుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తుంటే కూతురు కవిత, బంధువులు హరీష్ రావు, సంతోష్ లు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి విషయంలో కేసీఆర్ కుటుంబంలో అలజడి రేగిందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా తాను ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నానంటూ జరిగిన ప్రచారంపై కవిత స్పందించారు.
తెలుగు న్యూస్ ఛానల్ టీవి9 లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక వుందా? అంటూ సూటిగా అడిగిన ప్రశ్నకు కవిత అవుననో లేక కాదనో కాకుండా ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో తాను చాలా జూనియర్ అని... ఇప్పుడే తొందర ఏముందని అన్నారు. ఇలా ఇప్పటికయితే సీఎం పదవిని కోరుకోవడం లేదని... అలాగని ఎప్పటికీ కోరుకోనని కాదు అనేలా కవిత తెలివిగా సమాధానం చెప్పారు.
undefined
ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ మరింత యాక్టివ్ అయ్యారు. ఎన్నికల వ్యవహారాలన్నీ తానే చూసుకుంటూ కేసీఆర్ ను కేవలం ప్రచారానికే పరిమితం చేసాడు. దీంతో ఈసారి బిఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం రాజకీయాల్లో జోరందుకుంది. కేసీఆర్ కేంద్ర రాజకీయాలు చూసుకుంటారని... తెలంగాణ బాధ్యతలు మొత్తం కేటీఆర్ కు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read More CPM : సంగారెడ్డిలో ఆసక్తికర పరిణామం.. సీపీఎం మద్దతు కోరిన మంత్రి హరీశ్ రావు
అయితే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికీ కేసీఆర్ అవసరం తెలంగాణకు చాలా వుందని...ఆయనే తిరిగి సీఎం అవుతారని అంటున్నారు. బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఈసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు.
ఇక కేటీఆర్ ను సీఎం చేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలను కుటుంబసభ్యులే అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ ను సీఎం చేస్తే కుటుంబంలో చిచ్చురేగి అదికాస్తా పార్టీకి చేరుతుందని... ఎంతో కష్టపడి నిర్మించుకున్న బిఆర్ఎస్ ముక్కలు అవుతుందని కేసీఆర్ భయపడిపోతున్నారట. అందుకోసమే ఇదివరకే కొడుకును సీఎం చేయాలని అనుకున్నా పరిస్థితులను అర్థం చేసుకుని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి కొడుకు కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్. ఇది కూడా కేటీఆర్ ను సీఎం చేయాలనే ఎత్తుగడలో భాగమేనట. పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించిన తర్వాత కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ చూస్తున్నారట. ఇందులో భాగంగానే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా కేటీఆర్ కు అప్పగించారు... తిరిగి పార్టీని గెలిపించుకుంటే కేటీఆర్ కు సత్తాఏంటో అందరికీ అర్థమవుతుంది. అప్పుడు అందరి ఆమోదంతో కొడుకుకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని బిఆర్ఎస్ అధినేత ఆలోచనగా అర్థమవుతోంది.