ఓటింగ్ రోజు అన్ని సంస్థలకు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే.. - వికాస్‌ రాజ్‌

Published : Nov 28, 2023, 04:44 PM IST
ఓటింగ్ రోజు అన్ని సంస్థలకు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే.. - వికాస్‌ రాజ్‌

సారాంశం

telangana Assembly elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) రోజు కచ్చితంగా అన్ని సంస్థలు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

telangana Assembly elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly polls 2023)కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నేటితో అభ్యర్థుల ప్రచారం కూడా ముగియనుంది. రేపు (బుధవారం) సాయంత్రం నాటికి పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారు. ఎళ్లుండి (గురువారం) ఉదయం నుంచి పోలింగ్ మొదలుకానుంది. అయితే ఈ నేపథ్యంలో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తెలంగాణలోని అన్ని ప్రైవేటు, ఐటీ కంపెనీలు కచ్చితంగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ (telangana chief election commissioner vikas raj) స్పష్టం చేశారు. 

కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

గతంలో జరిగిన ఎన్నికల్లో అంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly polls 2018), 2019 లోక్ సభ ఎన్నికల (lok sabha polls 2019) సమయంలో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు అన్ని కంపెనీలో సెలవు ప్రకటించిందో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ఓటింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Rahul gandhi : బీజేపీ ఎక్కడ చెబితే అక్కడ మజ్లిస్ పోటీ చేస్తుంది - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కాగా.. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలువులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ ఉద్యోగులు, కార్మికులందరికీ నవంబర్ 30వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3వ తేదీన జరగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడికానున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు