మజ్లిస్‌ను పెంచి పోషించిందే కాంగ్రెస్.. బీజేపీని ముస్లిం ఆడబిడ్డలు ఆదరిస్తున్నారు : కిషన్ రెడ్డి

Siva Kodati |  
Published : Nov 28, 2023, 04:37 PM ISTUpdated : Nov 28, 2023, 04:40 PM IST
మజ్లిస్‌ను పెంచి పోషించిందే కాంగ్రెస్.. బీజేపీని ముస్లిం ఆడబిడ్డలు ఆదరిస్తున్నారు : కిషన్ రెడ్డి

సారాంశం

మజ్లీస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ వాళ్లేనని ఆరోపించారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మజ్లిస్ గుండాయిజాన్ని బీజేపీ ఎట్టి పరిస్ధితుల్లో సహించదని.. దళిత, బీసీ యువత బీజేపీ వెనుక నిలబడ్డారని ఆయన తెలిపారు.

మజ్లీస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ వాళ్లేనని ఆరోపించారు కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాము గతంలో పాదయాత్రలు చేస్తే ముస్లిం మహిళలు బయటకు వచ్చేవారు కాదని తెలిపారు. కానీ ఇప్పుడు ముస్లిం ఆడబిడ్డలు బీజేపీని ఆదరిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో డిసెంబర్ 3 తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన జోస్యం చెప్పారు. 

ALso Read: Breaking News : నిర్మల్ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు

గాంధీ కుటుంబం వల్లే దేశ విభజన జరిగిందని.. హైదరాబాద్‌లో మత కల్లోలాలకు కాంగ్రెస్సే కారణమన్నారు. మజ్లిస్ పార్టీని ఎదుర్కొన్నది బీజేపీ ఒక్కటేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మజ్లిస్ గుండాయిజాన్ని బీజేపీ ఎట్టి పరిస్ధితుల్లో సహించదని.. దళిత, బీసీ యువత బీజేపీ వెనుక నిలబడ్డారని ఆయన తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని ఆయన దుయ్యబట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండగ 30వ తేదీన జరగనుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. కుటుంబ, అవినీతి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పనున్నారని.. బీఆర్ఎస్ చేతిలో మరోసారి పడి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. బీజేపీని ఆశీర్వదించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను బహిష్కరించాలని కిషన్ రెడ్డి కోరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు