తెలంగాణ అసెంబ్లీలో శనివారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం తీసుకున్నారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 101 మంది ప్రమాణం తీసుకోగా.. 18 మంది తీసుకోలేదు. ఇందులో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఎందుకు ప్రమాణం స్వీకారం చేయలేదు?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శనివారం ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్ చేత ప్రమాణం చేయించారు. అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 101 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 18 మంది ప్రమాణం తీసుకోలేదు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇంతకీ వీరు ఎందుకు ప్రమాణం తీసుకోలేదు?
ఈ రోజు ఉదయం తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం తీసుకున్నారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క,సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం తీసుకున్నారు.
undefined
కాగా, 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణం తీసుకోలేదు. అందులో ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌లు ఉన్నారు. వీరు సిట్టింగ్ ఎంపీలు. రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్‌కు తన రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, ప్రమాణం చేశారు. కానీ, ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఇంకా వారి రాజీనామాలను స్పీకర్‌కు అందించలేదు. వారు ఢిల్లీకి వెళ్లి రాజీనామాలు సమర్పించి ప్రమాణం చేయాల్సి ఉన్నది.
Also Read: Rythu Bandhu: రైతు బంధుపై పొలిటికల్ హీట్.. ఎప్పుడిస్తారని హరీశ్ రావు ప్రశ్న.. మంత్రి సీతక్క సమాధానం
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ఎంచుకున్నారని, తాము ఆయనతో ప్రమాణం తీసుకోబోమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు.
వీళ్లతోపాటు బీఆర్ఎస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలూ ప్రమాణం చేయలేదు. మాజీ సీఎం, దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ యశోద హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్‌కు తోడుగా కేటీఆర్ ఉన్నారు. ఈ కారణంగా వీరిద్దరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు. వీరితోపాటు కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, టి పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు కూడా పలు కారణాలతో ప్రమాణం చేయలేదు. కడియం, పల్లా, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా తమ రాజీనామాలు అందజేసిన సంగతి తెలిసిందే.