Voters List: ఇదే చివరి అవకాశం.. లేదంటే ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందే

By Mahesh K  |  First Published Dec 9, 2023, 5:08 AM IST

తమ ఓటు నమోదు చేసుకోవడానికి, లేదా సవరణ చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఇందుకు అవకాశం ఇచ్చింది.
 


హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల నమోదు, సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పోవడంతో ఈ అవకాశం మనకు రెండో సారి వచ్చింది. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ముసాయిదా ఓటర్ల జాబితా జనవరి 6వ తేదీన వెలువరించనున్నట్టు ఈసీ తెలిపింది. మరోసారి ఓటర్ల జాబితాలో సవరణకు అవకాశం ఇచ్చింది. అలాగే.. 18 ఏళ్లు నిండిన యువత కూడా ఓటుకు నమోదుకు అవకాశం ఉన్నది. ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు సవరణలు చేసుకోవడానికి పౌరులకు అవకాశం ఇచ్చింది. జనవరి 6వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. ఆ ముసాయిదా జాబితాలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే వాటిని జనవరి 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన ఫైనల్ లిస్టు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

Latest Videos

జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సూచించారు.  ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ 1వ తారీఖులను వయసు కోసం ప్రామాణికంగా తీసుకుని ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్(https://voters.eci.gov.in/) సందర్శించాలని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

click me!