ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు, లేకపోతే బెదిరిస్తున్నాడు: కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

By Nagaraju penumalaFirst Published Mar 9, 2019, 6:52 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ ఒక్కరేనని ఆరోపించారు. దేశమంతా మోదీని విమర్శిస్తుంటే కేసీఆర్ ఒక్కే మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు మోదీ సపోర్ట్ చేశారని ఆ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ లు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 
 
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఓట్లు తొలగించి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారంటూ ధ్వజమెత్తారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ ఒక్కరేనని ఆరోపించారు. దేశమంతా మోదీని విమర్శిస్తుంటే కేసీఆర్ ఒక్కే మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు మోదీ సపోర్ట్ చేశారని ఆ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ లు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

ముందస్తు ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ,కేసీఆర్ చేతుల్లో పెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఈవీఎంల ట్యాపరింగ్, ఓట్ల తొలగింపులతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 

మోదీ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్ ఆయన తనయుడు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదరించి భయభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 

పార్టీ ఫిరాయించిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు, భూమి ఇస్తున్నారని వినకపోతే బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. మోదీపై మీడియా ఎదుట సీఎం కేసీఆర్, కేటీఆర్ లు తిడతారని కానీ వెనుకాల మాత్రం మోదీని కలుస్తారంటూ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశారని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాటు చేయోద్దంటూ రాములమ్మ పిలుపునిచ్చారు. 
 
click me!