కేసీఆర్ సిగ్గుందా, నైతిక విలువలు ఉంటే ఆ పనిచెయ్యవు: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Mar 9, 2019, 6:31 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎంతకు కొన్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటావా అంటూ మండిపడ్డారు. 
 
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎంతకు కొన్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటావా అంటూ మండిపడ్డారు. 

కేసీఆర్ కు నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యరన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతలా మారిపోయారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో కూడా కేసీఆర్ లాంటి నియంతకు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే లగడపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

click me!