మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్

By sivanagaprasad KodatiFirst Published Dec 29, 2019, 5:34 PM IST
Highlights

తాను మంత్రి పదవి కంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటానికే ఇష్టపడతానన్నారు కేటీఆర్. కొత్త మున్సిపాలిటీ చట్టంతో అవినీతికి చెక్ పెట్టామని మంత్రి గుర్తుచేశారు

తాను మంత్రి పదవి కంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటానికే ఇష్టపడతానన్నారు కేటీఆర్. కొత్త మున్సిపాలిటీ చట్టంతో అవినీతికి చెక్ పెట్టామని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ రోడ్లు త్వరలోనే మెరుగుపడతాయన్న ఆయన.. సమగ్ర రోడ్ల నిర్వహణ చేస్తామన్నారు.

దేశంలోనే అత్యంత ప్రశాంత నగరం హైదరాబాదేనన్నారు. ఆదివారం ట్విట్టర్లో #AskKTR పేరుతో మంత్రి నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ కు షాక్...కాళేశ్వరంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని.. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్, ప్రాసెసింగ్ కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టామని కేటీఆర్ తెలిపారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు 2020: ఎవరి ధీమా వాళ్లదే

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో త్వరలోనే డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని.. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను తయారు చేసే ప్లాంట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పుతామన్నారు.

Also Read:బీజేపీకి చెక్: హైద్రాబాద్‌‌లో భారీ సభ,కేసీఆర్ ప్లాన్ ఇదీ

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి తెలివిగా సమాధానం ఇచ్చారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగితే బాగుంటుందని కేటీఆర్ వెల్లడించారు. 

click me!