అనుచరుల వద్ద కన్నీటి పర్యంతమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Siva Kodati |  
Published : Mar 24, 2019, 04:50 PM IST
అనుచరుల వద్ద కన్నీటి పర్యంతమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తాజా ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన పొంగులేటికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తాజా ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన పొంగులేటికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. ఆయనకు బదులుగా కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్‌లో చేరిన నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన తర్వాత ఆదివారం ఆయన ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటిని పలువురు అనుచరులు, కార్యకర్తలు కలిశారు. అన్యాయం జరిగిందంటూ శ్రీనివాస్ రెడ్డి వద్ద భోరున విలపించారు. వారిని చూసి ఎంపీ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని నామినేషన్ దాఖలు చేయాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్