అసదుద్దిన్ తో మంత్రి తలసాని భేటీ...కొడుకుకు మద్దతుకోసమేనా?

Published : Mar 24, 2019, 04:18 PM ISTUpdated : Mar 24, 2019, 05:35 PM IST
అసదుద్దిన్ తో మంత్రి తలసాని భేటీ...కొడుకుకు మద్దతుకోసమేనా?

సారాంశం

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దిన్ ఓవైసీతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓవైసీని తన కుమారుడు, సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ ని పరిచయం చేశారు. సికింద్రాబాద్ లో అతడి గెలుపుకు సహకరించాలని తలసాని ఓవైసి కోరగా అందకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి మంచి పట్టున్న విషయం  తెలిసిందే. ముఖ్యంగా  మైనారిటీలు ఈ పార్టీకి కొండంత అండగా నిలిచారు. పాతబస్తీ ప్రాంతంలో కార్పోరేటర్ నుండి ఎమ్మెల్యే దాకా ఈ పార్టీ నాయకులే. అలాగే మిగిలిన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని అసెంబ్లీ,  పార్లమెంట్ నియోజకర్గాల్లో కూడా ఈ పార్టీ  ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే సికింద్రాబాద్ బరిలో వున్న తన తనయుడికి మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిచేలా చూడాలని  ఓవైసిని తలసాని కోరారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్,  ఎంఐఎం మిత్రపక్షాలుగా మెలిగినా అధికారంగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. అయితే తాము పోటీ చేస్తున్న స్థానాల్లో తప్ప మిగతా చోట్లు  ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని ఓవైసి సూచించారు. ఇలా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం అనధికారిక మిత్రపక్షంగా కొనసాగుతోంది. 

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ప్రకారమే మైనారిటీ ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతున్నాయి. అందువల్ల తాము ఫోటీ చేసే హైదరాబాద్ మినహా మిగతా లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతివ్వనుంది. ఈ విషయం కూడా మంత్రి తలసాని ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్