తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు: టీటీడీపీ నేతల్లో విభేదాలు

By narsimha lodeFirst Published Mar 24, 2019, 2:27 PM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తెలంగాణ టీడీపీ నేతల్లో విభేదాలు నెలకొన్నాయి.  ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తెలంగాణ టీడీపీ నేతల్లో విభేదాలు నెలకొన్నాయి.  ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనే విషయమై ఆదివారం నాడు చర్చించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలున్నాయి. అయితే తమకు క్యాడర్‌ ఉన్న చోట పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని టీటీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. కనీసం నాలుగు లేదా ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది.

ఈ తరుణంలో  తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కోరారు. దీంతో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదికను ఇచ్చారు.

ఆదివారం నాడు తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. అయితే తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కూడ పోటీ చేయాలని కూడ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే ఎంపీ స్థానాల్లో పోటీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్‌ను ఓడించేందుకు గాను  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే యోచనలో ఉన్న విషయాన్ని కొందరు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు 24 మంది అభ్యర్థులు ధరఖాస్తులు చేసుకొన్నారు. అయితే పోటీకి ఆసక్తిగా ఉన్న వారి పేర్లను ప్రకటిస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయాలను కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. 

నలుగురైదుగురు నేతలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవడాన్ని కొత్తకోట దయాకర్ రెడ్డి తప్పుబడుతున్నారు.పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని దయాక్ర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధాలు

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు

 

click me!