రేవంత్ ఎలక్షన్ కోడ్ ఉళ్లంఘన: ఈసీకి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Apr 11, 2019, 7:29 AM IST
Highlights

మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ని ఉళ్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు అందింది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసినా ఆయన బుధవారం కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి తనకు ఓటేయాలంటూ అభ్యర్థించినట్లు స్థానిక నాయకులు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు అధికారులను కోరారు. 
 
మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి, రావల్‌కోల్, రావల్‌కోల్ తండా, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో రేవంత్ బుధవారం పర్యటించి ప్రచారం చేసినట్లు స్థానిక నాయకులు గుర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి అందించారు. 

రేవంత్ డబ్బులు పంచి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన అనుచరులు, కార్యకర్తల చేత ప్రజలను ప్రభావితం చేసేలా వ్యవహరించినట్లు ఆరోపించారు. కాబట్టి తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి రేవంత్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు ఎన్నికల అధికారిని కోరారు. 
 
click me!