కిషన్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు: హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్

By Arun Kumar PFirst Published Apr 10, 2019, 8:32 PM IST
Highlights

సికింద్రాబాద్ లోక్ సభ స్ధానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ నుండి తప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. అతడు ఎన్నికల నియమావళిని ఉళ్ళంఘిస్తూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించినట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదు కిషన్ రెడ్డికి సంబంధించినవేనని...ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఆ డబ్బును తరలిస్తున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల అతడిని అనర్హుడిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ నుండి తప్పించాలని కోర్టును కోరారు. 

ఈ పిటిషన్ కు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న బిజెపి నాయకులపైనా చర్చలు తీసుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ఏజంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, న్యాయవాది ముఖీద్ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ నవీన్ రావు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

రిజర్వు బ్యాంకు నిబంధన ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బు బ్యాంక్ నుండి విత్ డ్రా చేయడానికి వీలు లేనప్పటికి బిజెపి నాయకులు ఏకంగా రూ.8 కోట్లు విత్ డ్రా చేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికలకు మరికొద్ది గంటల సమయం వుండగానే ఇలా భారీ మొత్తంలో డబ్బులను పంచి ఓటర్లను ప్రలోభ పెట్టాలన్నదే వారి ఉద్దేశమని పిటిషనర్లు ఆరోపించారు. 

ఈ  విషయంపై ఇప్పటికే ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించమని ఈసీని ఆదేశించాలని కోరుతూ తామీ పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ ప్రకటనలో టీఆర్ఎస్ పేర్కొంది. 
 
click me!