ఈసీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి...డబ్బు పంపిణీ దుష్ప్రచారంపై పిర్యాదు

By Arun Kumar PFirst Published Apr 10, 2019, 4:27 PM IST
Highlights

చేవెళ్ల లోక్ షభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తాను గెలుస్తానన్న భయంతోనే అధికార పార్టీ తనపై తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు.  కేవలం ఎన్నికలకు ఒక్క రోజు ముందే తన మద్దతుదారులు, సన్నిహితుల  వద్ద భారీ మొత్తంలో డబ్బు దొరికినట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
బుధవారం విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి రజత్ కుమార్ ను కలిసి ఈ  విషయంపై ఫిర్యాదు చేశారు. ఇలా తనపై దుష్ప్రచారానికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని  ఈసీని కోరారు. 
 
ఈసీకి పిర్యాదు చేసిన అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10లక్షలు దొరికాయంటూ జరుగుతున్నది  తప్పుడు ప్రచారమన్నారు. పోలింగ్ కు ఒక్కరోజు ముందు తనపై బుదరజల్లే ప్రయత్నంలో భాగమే ఈ ప్రచారమన్నారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తానని వారికి సమాచారం వుండటం వల్లే ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. మొదట్లో చేవెళ్ల పరిధిలోని కిందిస్థాయి కాంగ్రెస్ నాయకులను ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆరోపించారు. అయినా తనను ఓడించడం కష్టమని తెలిసే ఇప్పుడు ఇలా తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

 బుధవారం రాత్ని విశ్వేశ్వర్ రెడ్డివద్ద పనిచేసే సందీప్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో వద్ద సందీప్ ప్రయాణిస్తున్న కారును నిలిపి తనిఖీ చేసిన పోలీసులు డబ్బు పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోడ్ పద్దతిలో వున్న ఆ పత్రాల్లోని సమాచారాన్ని పోలీసులు డీ కోడ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఆ పత్రాల్లో ఏముందో తేలుతుందని పోలీసులు తెలిపారు.వీటితో పాటు సందీప్ రెడ్డి వద్ద రూ. 10 లక్షల నగదుతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
  
click me!