మల్కాజిగిరిలో ఆ ఓట్లపైనే అనుమానం...ఈసికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 2:22 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈసారి ముందుగానే అప్రమత్తమమవుతున్నారు. ఇలా తమ నియోజవర్గ పరిధిలోని ఓటర్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించి తమ అనుమానాలను ఈసీ దృష్టికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరిలో అనుమానాస్పద ఓట్లున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. 

తాను పోటీ చేస్తున్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కొన్ని అనుమానాస్పద ఓట్లను గుర్తించినట్లు రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టును పరిశీలించగా ఈ విషయం బయటపడిందన్నారు. ఒకే ఇంటి నంబరుతో చాలా సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని...వాటిని మరోసారి పరిశీలించాల్సిందిగా కోరారు. ఇలా అనుమానాస్పద ఓట్ల నమోదులో ఏవైనా అవకతవకలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ సూచించారు. 

ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘానికి రేవంత్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తన అధికారాలను అడ్డం పెట్టుకుని గెలవడానికి ప్రయత్నిస్తోందని ముందునుంచి ఆయన ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన రేవంత్ ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇలా మల్కాజిగిరి ఓటర్ లిస్ట్ును కూడా క్షుణ్ణంగా పరిశీలించి  అందులో అనుమానాస్పద ఓట్లను  గుర్తించారు. ఇవి టీఆర్ఎస్ అనుకూల అక్రమ ఓట్లుగా భావించి రేవంత్ ఈసికి ఫిర్యాదు చేశారు.   

click me!