ఉస్మానియా యూనిర్శిటీలో భారీ నగదు పట్టివేత

Published : Apr 04, 2019, 12:23 PM IST
ఉస్మానియా యూనిర్శిటీలో భారీ నగదు పట్టివేత

సారాంశం

సార్వత్రిక ఎన్నికల వేళ..హైదరాబాద్ నగరంలో నగదు కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల వేళ..హైదరాబాద్ నగరంలో నగదు కలకలం రేపింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ నగదు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా.. ఈ నగదు తీసుకువెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడికారులో నగదు తీసుకువచ్చి.. వోల్క్స్ వాగెన్ లోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో మొత్తం రూ.49లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్