టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

By Arun Kumar PFirst Published Apr 12, 2019, 1:36 PM IST
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
తన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పలు పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఈ క్రమంలో కాచిగూడలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యేకు తెలంగాణ యువమోర్చ అధ్యక్షులు రంజిత్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 

ఇంతటితో ఆగకుండా ఇరు వర్గాలు ఈ గొడవపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే తనను దుర్భాషలాడాడంటూ రంజిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే తనను బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి, నందులు కులం పేరుతో దూషించారంటూ టీఆర్ఎస్ నాయకులు దుర్గరాజు ఇచ్చిన పిర్యాదు మేరకు వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.   

click me!