శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్

By Siva KodatiFirst Published Apr 12, 2019, 10:33 AM IST
Highlights

ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని ఓట్లు గల్లంతైన ఘటనలో ఇద్దరిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన శోభనకు ఓటు లేదని అధికారులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. 

ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని ఓట్లు గల్లంతైన ఘటనలో ఇద్దరిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన శోభనకు ఓటు లేదని అధికారులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు.

దీనిపై శోభన కుమార్తె, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ ఓట్ల గల్లంతు వ్యవహారంపై దర్యాప్తు చేసింది. శోభన కామినేనికి మెహదీపట్నం సర్కిల్‌లోని విజయనగర్ కాలనీలోని పోలింగ్ బూత్ నెం. 49లో రెండు ఓట్లు ఉన్నాయి.

ఈ రెండు ఎంట్రీలతో సెప్టెంబర్ 2017 నుంచి ఆమె వద్ద రెండు ఎపిక్ కార్డులు (WRH1050657), (KYJ2288397) ఉన్నాయి. ఈ మధ్య డూప్లికేట్ కార్డులను తొలగించే ప్రక్రియ మొదలైన తర్వాత దీనిని గుర్తించిన బీఎల్‌వో.. శోభనకు నోటీసులు జారీ చేశారు.

ఈ రెండింటిలో ఒక ఓటును తొలగించాల్సిందిగా బీఎల్‌వోను సహాయ ఎన్నికల అధికారి ఆదేశించారు. అయితే లిఖిత పూర్వకంగా 7ఏ నోటీసులు జారీ చేయకుండా శోభనా కామినేనికి చెందిన రెండు ఓట్లను బీఎల్‌వో తొలగించారు.

సరైన ఆధారాలు లేకుండా రెండు ఓట్లను తొలగించిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ... ఇందుకు బాధ్యులైన బూత్ లెవల్ అధికారిగా ఉన్న పీహెచ్ వర్కర్ ఓంప్రకాశ్‌ను సస్పెండ్ చేసింది. అలాగే ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నరేందర్ రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

click me!