తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం

Siva Kodati |  
Published : Apr 12, 2019, 12:28 PM IST
తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ స్వల్ప అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు వేసిన కేంద్రంలో కరెంట్ వైర్ తెగి పడటం కలకలం రేపింది

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ స్వల్ప అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు వేసిన కేంద్రంలో కరెంట్ వైర్ తెగి పడటం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ రాజ్‌నగర్ అంగన్‌వాడీలో 114 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇక్కడ మీడియా, అధికారులు హాడావిడిగా ఓ బల్బు కోసం ఏర్పాటైన కరెంట్ వైరు తెగిపోయింది.

దానిని ఎవరూ గమనించలేదు. గవర్నర్ దంపతులు ఓటు వేసిన అనంతరం విద్యుత్ వైరు తెగినట్లు గుర్తించిన అధికారులు హుటాహుటిన దానిని జాయింట్ చేశారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని దానిని అందరూ సద్వినియోగ పరచుకోవాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్