జాతకాలు చూసుకొంటే నీకొచ్చిన నష్టమేమిటి: మోడీపై కేసీఆర్

By narsimha lodeFirst Published Apr 7, 2019, 5:58 PM IST
Highlights

తాను జాతకాలు చూసుకొంటే నీకొచ్చిన నష్టం ఏమిటని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిని ప్రశ్నించారు.

ఆదిలాబాద్: .తాను జాతకాలు చూసుకొంటే నీకొచ్చిన నష్టం ఏమిటని  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిని ప్రశ్నించారు.

ఆదివారం నాడు ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ చీఫ్,తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తాను జాతకాలు చూసి పనులు చేస్తానని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు. 

మోడీ వస్తే ఆయనకు కూడ తీర్థ ప్రసాదాలు ఇస్తానని కేసీఆర్  మోడీపై ఎద్దేవా చేశారు.ప్రధానమంత్రి పాలసీలపై మాట్లాడాలి కానీ, వ్యక్తిగతంగా మాట్లాడం సరైంది కాదన్నారు. ఎన్నికల 

పహణి, నకల్ మార్చేసినట్టు ఆయన వివరించారు.జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేసీఆర్ చెప్పారు.తెలంగాణకు పాత ఆదిలాబాద్‌ కాశ్మీర్ మాదిరిగా ఉంటుందన్నారు. మంచిర్యాల రైతు ఫేస్‌బుక్‌లో వీడియో పెడితే ఆ సమస్యను తాను పరిష్కరించినట్టు కేసీఆర్ వివరించారు.

రైతు పథకం ద్వారా రైతుల జీవితాల్లో భరోసాను కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు ఎమ్మార్వోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాను ఐదేళ్లుగా కేంద్రాన్ని కోరినా కూడ పట్టించుకోలేదన్నారు. ఇవాళ ఎన్నికల్లో తమకు ఓటేస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇంత కాలం ఎందుకు బీజేపీ నేతలు పట్టించుకోలేదో చెప్పాలన్నారు.

త్వరలో ప్రతి జిల్లాలో తాను రెండు రోజుల పాటు పర్యటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. భూ సమస్యలను అప్పటికి అప్పుడే పరిష్కరిస్తానిన ఆయన హామీ ఇచ్చారు.  తన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రులు, అధికారులు వస్తారని ఆయన చెప్పారు.

గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ రూ. 15 లక్షలను ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఎందుకు ఈ నిధులను జమ చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి హిందూ, ముస్లింలు, రామాలయం బీజేపీ నేతలకు గుర్తుకు వస్తాయని కేసీఆర్ విమర్శించారు.


 

click me!