ఎన్నికల మాయ.. ఏటీఎంలలో రూ.2వేల నోట్లు మాయం

By ramya NFirst Published Apr 4, 2019, 2:48 PM IST
Highlights

 ఎన్నికల ఎఫెక్ట్.. ఏటీఎంలపై పడింది. ఈ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్లు అదృశ్యమయ్యాయి. నగరంలోని ఏటీఎంలలో డ్రా చేస్తే కేవలం రూ.500 నోట్లు, వందనోట్లు మాత్రమే వస్తున్నాయి.

ఎన్నికల ఎఫెక్ట్.. ఏటీఎంలపై పడింది. ఈ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్లు అదృశ్యమయ్యాయి. నగరంలోని ఏటీఎంలలో డ్రా చేస్తే కేవలం రూ.500 నోట్లు, వందనోట్లు మాత్రమే వస్తున్నాయి.

ఇది ఈ రోజు పుట్టుకు వచ్చిన సమస్య కాదు.ఎన్నికల నొటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే ఏటీఎంలలో రూ.2వేల నోట్లు మాయం అయ్యాయి. జీతాలు అందుకున్న ఉద్యోగులు ఏటీఎంలలో మనీ డ్రా చేద్దామని వెళ్తే.. రూ.2వేలు నోటు రావడం లేదని వాపోతున్నారు.

నగరంలో అన్ని ప్రాంతాల ఏటీఎంలలో రెండు వేల రూపాయల నోట్లే రావడం లేదని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగి చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం రిజర్వు బ్యాంకు నుంచి కూడా బ్యాంకులకు రెండువేల రూపాయల నోట్లు రావడం లేదని ఓ బ్యాంకు ఉద్యోగి చెప్పారు.

 గత మూడు నెలలుగా రెండువేల రూపాయల నోట్ల చలామణీ గణనీయంగా తగ్గిందని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడొకరు చెప్పారు. 2017లో రూ.3,285 మిలియన్ల రెండు వేలరూపాయల నోట్లు చలామణిలో ఉండగా, 2018లో ఈ నోట్ల సంఖ్య 3,363 కోట్లరూపాయలకు పెరిగింది. కాని 2017 కంటే 2018లో రెండువేల రూపాయల నోట్ల చలామణీ గణనీయంగా తగ్గిందని ఓ బ్యాంకు అధికారి వివరించారు.

click me!