బండి నెంబర్ మూడంకెలు: మాట తప్పుతున్న జితేందర్ రెడ్డి

By narsimha lodeFirst Published Mar 26, 2019, 12:02 PM IST
Highlights

తన బండి నెంబర్ మూడంకెలు.... నేను ఇప్పటికే మూడు పార్టీలు మారాను. ఇదే చివరిది. ఇక పార్టీలు మారను అని మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి టీడీపీలో చేరే సమయంలో వ్యాఖ్యానించినట్టుగా ఆ జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు.
 

మహబూబ్‌నగర్:  తన బండి నెంబర్ మూడంకెలు.... నేను ఇప్పటికే మూడు పార్టీలు మారాను. ఇదే చివరిది. ఇక పార్టీలు మారను అని మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి టీడీపీలో చేరే సమయంలో వ్యాఖ్యానించినట్టుగా ఆ జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నుండి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ అగ్రనేత రాం మాధవ్‌తో భేటీ కావడంతో  ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్టుగా కన్పిస్తోంది.

ఏపీ జితేందర్ రెడ్డి తొలుత ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీలో ఉండేవాడు. ఎన్ఆర్ఐగా ఉన్న జితేందర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. అయితే ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు.

అయితే అదే సమయంలో టీడీపీలో సంక్షోభం కారణంగా ఏపీ జితేందర్ రెడ్డి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీలో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1999 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి టీడీపీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేసిన జితేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి  విఠల్ రావు చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఆ తర్వాత కొంత కాలానికి జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన సమయంలో  నిర్వహించిన సభలో  తన బండి నెంబర్ మూడంకెలు ఉంటుంది.  నేను ఇప్పటికే మూడు పార్టీలు మారాను... ఇదే చివరి పార్టీ.  ఈ పార్టీని వీడను అంటూ వ్యాఖ్యానించారు.

జితేందర్ రెడ్డి ఉపయోగించే వాహనాల నెంబర్ 123గా ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు  జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ లో చేరారు. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహాబూబ్ నగర్ ఎంపీ గా బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీలోకి చేరనున్నారు. జితేందర్ రెడ్డి బీజేపీలో చేరితే ఆయన పార్టీలు మారడం  ఐదోసారి కానుంది.


సంబంధిత వార్తలు

రాం మాధవ్‌తో టీఆర్ఎస్ ఎంపీ భేటీ

click me!