టీఆర్ఎస్ తరపున కేంద్రమంత్రి ఆయనే: కేటీఆర్ ప్రకటన

By Nagaraju penumalaFirst Published Mar 25, 2019, 9:06 PM IST
Highlights

రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీ నేతలకు కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. ప్రస్తుతం సొంత బలంతో అధికారంలోకి వచ్చే పరిస్థితి మోదీకి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ కి 16 మంది ఎంపీలను ప్రజలు ఇస్తే వారికి తోడు మరో 140 మంది ఎంపీలను కేసీఆర్‌ ఏకం చేస్తారని తెలిపారు. 
 
కరీంనగర్: కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ గెలిచిన తర్వాత అదృష్టం బాగుంటే కేంద్రమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నుంచి 150 మందికిపైగా ఎంపీలు గెలవబోతున్నారని తెలిపారు. 

రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీ నేతలకు కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. ప్రస్తుతం సొంత బలంతో అధికారంలోకి వచ్చే పరిస్థితి మోదీకి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ కి 16 మంది ఎంపీలను ప్రజలు ఇస్తే వారికి తోడు మరో 140 మంది ఎంపీలను కేసీఆర్‌ ఏకం చేస్తారని తెలిపారు. 

ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు కాళేశ్వరం పూర్తి చేసిన గోదావరి నీళ్లు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్డీయేతో కలిసి చంద్రబాబు పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు రావాలంటే 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని తెలిపారు. 

కొత్తగా ఏర్పడిన, చిన్న రాష్ట్రానికి అండగా ఉండాల్సిన మోదీ మనకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ఒకే ఒక్క కేంద్రమంత్రి పదవి ఇచ్చి మూడేళ్లకే తొలగించారని విమర్శించారు. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించని మోదీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. 

ఈ దేశానికి కావాల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదన్నారు. జిమ్మేదారు మనిషి కావాలన్నారు. దేశానికి మాటల మనిషి కాకుండా కేసీఆర్‌లాంటి చేతల మనిషి కావాలని తెలిపారు. ఢిల్లీని శాసించే శక్తిగా టీఆర్ఎస్ మారాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కల్గిన సీఎం అని సర్వేలు చెప్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
click me!