new rule:ఆన్‌లైన్ మోసాలపై కొత్త చట్టం.. టెక్ కంపెనీల సంపాదనలో 10 శాతం జరిమానా..

Ashok Kumar   | Asianet News
Published : Mar 10, 2022, 11:20 AM ISTUpdated : Mar 10, 2022, 11:21 AM IST
new rule:ఆన్‌లైన్ మోసాలపై కొత్త చట్టం.. టెక్ కంపెనీల సంపాదనలో 10 శాతం జరిమానా..

సారాంశం

బ్రిటన్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం, తప్పుడు ప్రకటనల నుండి వినియోగదారులను టెక్ కంపెనీలే రక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా మోసగాళ్ళు కంపెనీలు లేదా సెలబ్రిటీల పేరుతో వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించినా 10 శాతం వరకు జరిమానా విధించవచ్చు.   

అమెరికన్ టెక్ దిగ్గజాలు  గూగుల్ (Google), ఫేస్ బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter) ఇతర ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అలాగే సెర్చ్ ఇంజిన్‌లు డబ్బు కోసం మోసపూరిత ప్రకటనలను పోస్ట్ చేయకుండా నిరోధించడానికి యూ‌కే కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది.

దీని ప్రకారం, కంపెనీలే ఈ ప్రకటనల నుండి వినియోగదారులను రక్షించవలసి ఉంటుంది. కంపెనీలు లేదా సెలబ్రిటీల పేరుతో వినియోగదారుల వ్యక్తిగత డేటాను మోసగాడు దొంగిలించినా, తప్పుడు ఆర్థిక పెట్టుబడులు చేసినా లేదా బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినా, కంపెనీల వార్షిక టర్నోవర్‌లో రూ.180 కోట్ల నుంచి 10 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే వారి సేవలను కూడా నిలిపివేయవచ్చు.

వివిధ ఏజెన్సీలు, నిపుణుల సూచన మేరకు బ్రిటన్ ఈ చర్య తీసుకుంటోంది. చట్టం  ముసాయిదా ప్రకారం, మోసాలను నిరోధించడానికి కంపెనీలు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఈ టెక్ అండ్ సోషల్ మీడియా కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ ప్రకటనల కారణంగా మోసాలు పెరిగాయని దేశ సాంస్కృతిక మంత్రి నాడిన్ డోరీస్ తెలిపారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడపడం ప్రారంభించారు.

2021లో 7600 కోట్లు వేల కోట్ల మోసం జరిగింది అంటే 2020 మొదటి ఆరు నెలల కంటే 33 శాతం ఎక్కువ. దీనిపై ఇక్కడి ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

తప్పుడు ప్రకటనల వలల్లో కస్టమర్లు 
యూ‌కే వినియోగదారుల హక్కుల కార్యకర్త అన్నాబెల్ హోల్ట్ ప్రకారం, వినియోగదారులు సోషల్ మీడియా అండ్ సెర్చ్ ఇంజన్లలో మోసపూరిత ప్రకటనలల్లో పడిపోతున్నారు. దీని వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇంకా అమాయక ప్రజలను మానసికంగా కూడా దెబ్బతీస్తుంది.

ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఖచ్చితంగా
తప్పుడు ప్రకటనలు మాత్రమే కాదు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా పరోక్షంగా లేదా చట్టవిరుద్ధమైన ఇటువంటి ఉత్పత్తులను పెయిడ్-ప్రమోషన్ చేస్తున్నారు. అదే సమయంలో భౌతికంగా  కూడా ప్రకటనలో తప్పుడు సమాచారం అందించబడుతుంది.
 

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా