చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల్లో ఒక్కటైన రియల్ మీ అపార్డబుల్ ఫ్లాగ్ షిప్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్2 ప్రో పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్‍తోపాటు 5ఎస్ కలర్ ఫోన్ కూడా అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: ఇప్పటివరకు కేవలం బడ్జెట్ మొబైల్ ఫోన్లపైనే దృష్టి సారించిన చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రియల్‌మీ తొలిసారి ఫ్లాగ్‌షిప్ కేటగిరీపై కన్నేసింది. అందునా అఫోర్డబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అది. అందుబాటు ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఎక్స్ 2 ప్రో పేరుతో నూతన మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి తెచ్చింది.
‘ఎక్స్2 ప్రో’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీంతోపాటు బడ్జెట్ కేటగిరీలో రియల్‌మీ 5ఎస్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ నెల 26 నుంచి రియల్‌మీ ఎక్స్2 ప్రో సేల్‌కి తీసుకొస్తున్నారు. 29 నుంచి రియల్‌మీ 5ఎస్ అందుబాటులోకి రానున్నది.
also read ఫేస్‌బుక్ కొత్త యాప్... ఎవరికోసమో తెలుసా ?
రియల్‌మీ ఎక్స్2 ప్రో ఆండ్రాయిడ్ 9.0(పై) ఆధారిత కలర్ ఓఎస్ 6.0తో పని చేస్తుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఇస్తున్నారు. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఈ మొబైల్ మొదలవుతుంది. 12జీబీ ర్యామ్ విత్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో మరో వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
రియల్ మీ ఎక్స్ 2 ప్రో మోడల్ ఫోన్‌కు 64 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. దాంతో పాటు 13ఎంపీ టెలీఫొటో లెన్స్‌ను, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌ను అమర్చారు. ముందు భాగంలో 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 471 కెమెరాను తీసుకొస్తున్నారు.
రియల్ మీ ఎక్స్ 2 ప్రో ఫోన్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఇది 50వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 35 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్ అవుతందని రియల్‌మీ తెలిపింది. 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. 12జీబీ ర్యామ్ విత్256జీబీ మోడల్‌ను రూ.33,999గా రియల్ మీ నిర్ణయించింది.
also read దెబ్బ మీద దెబ్బ: జియో ఎఫెక్ట్‌తో దిగ్గజ సంస్థలు 49 లక్షల యూజర్లు లాస్
ఇక రియల్ మీ విడుదల చేసిన మరో మోడల్ ‘5ఎస్’ కలర్ ఓఎస్ 6తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఆధారంగా పని చేస్తుంది. ఈ మొబైల్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720X1600) డిస్‌ప్లేతో తయారుచేసింది. దీనికి అక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ అమర్చారు. 4 జీబీ ర్యామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కల రియల్ మీ ‘5ఎస్’ మోడల్’ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఈ మొబైల్‌కు ప్రత్యేక ఆకర్షణ.
దాంతోపాటు 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మ్యాక్రో లెన్స్, 2ఎంపీ పోట్రైట్ సెన్సర్‌తో మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. ముందుభాగంలో 13 మెగాపిక్సల్‌తో సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ధర రూ. 9,999. అదే 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ఫోన్‌ను రూ. 10,999కే అందిస్తున్నారు.