టెలికం రంగంలో మరో గట్టిపోటీ కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలకు వొడాఫోన్ ఐడియా, భారతీఎయిర్‌టెల్ రెండు కలిపి 49 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో జియో 69.83 లక్షల మంది యూజర్లను పెంచుకుంది.
న్యూఢిల్లీ: వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలను కష్టాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలలోనూ భారీగా యూజర్లను కోల్పోయాయి. ఈ రెండు సంస్థలకు కలిపి సెప్టెంబర్‌లో 49 లక్షల మంది యూజర్లు దూరమైనట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తెలిపింది.
aslo read ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు...ఎందుకంటే ?
రిలయన్స్ జియో మాత్రం సెప్టెంబర్‌లో 69.83 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకున్నట్లు ట్రాయ్ గణాంకాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ నెలలో జీఎస్ఎం, సీడీఎంఐ, ఎల్టీఈ సహా మొత్తం వైర్లెస్ చందాదారులు 117.37 కోట్ల మందికి పెరిగారు. ఈ సంఖ్య ఆగస్టు నెలాఖరు నాటికి 117.1కోట్లుగా ఉంది.
పట్టణ ప్రాంతాల్లో వైర్లెస్ చందాదారుల సంఖ్య 65.91 కోట్లకు తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో 51.45 కోట్లకు పెరిగింది. నెట్‌వర్క్‌ల వారీగా చూస్తే సెప్టెంబర్ చివరి నాటికి సెప్టెబర్‌లో వొడాఫోన్-ఐడియా అత్యధికంగా 25.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
also read జియో కస్టమర్లకు మరో బ్యాడ్ న్యూస్...చార్జీల పెంపు..
భారతీ ఎయిర్‌టెల్‌కు సెప్టెంబర్‌లో 23.8 లక్షల మంది యూజర్లు తగ్గారు. సెప్టెంబర్‌లో 69.83 లక్షల మంది కొత్తగా రిలయన్స్ జియోను ఎంచుకున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు.. బీఎస్ఎన్ఎల్ 7.37 లక్షల యూజర్లను సెప్టెంబర్‌లో పెంచుకోగా, ఎంటీఎన్ఎల్ మాత్రం 8,717 మంది యూజర్లను కోల్పోయింది.
సెప్టెంబర్ నాటికి వొడాఫోన్-ఐడియా యూజర్లు 37.24 కోట్ల మంది కాగా, అది మార్కెట్లో 31.73 శాతం. భారతీఎయిర్‌టెల్ సబ్ స్క్రైబర్లు 32.55 కోట్ల మంది కాగా, మార్కెట్లో వాటా 27.74 శాతం. రిలయన్స్ జియో వినియోగదారులు 35.52 కోట్ల మంది కాగా, మార్కెట్లో వాటా 30.26 శాతం. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 11.69 కోట్ల మంది కాగా, ఎంటీఎన్ఎల్ కస్టమర్లు 33.93 లక్షల మందిగా ఉన్నారు.