ఫేస్‌బుక్ కొత్త యాప్ దీనిని (NPE) బృందం ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసి విడుదల చేసింది. కొత్త ఫేస్‌బుక్ వేల్ యాప్ వినియోగదారులకు వారి సొంత మీమీలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
ఐఫోన్ వినియోగదారుల కోసం ఫేస్‌బుక్ వేల్ అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇది ఐఫోన్ యాప్ స్టోర్‌లో మాత్రమే విడుదల చేశారు. కెనడాలోని వినియోగదారులు మాత్రమే దీన్ని ప్రస్తుతానికి డౌన్‌లోడ్ చేసుకోగలరు. కొత్త వేల్ యాప్ వినియోగదారులకు వారి సొంత మీమీలను సృష్టించడానికి సహాయపడుతుంది.
also read దెబ్బ మీద దెబ్బ: జియో ఎఫెక్ట్‌తో దిగ్గజ సంస్థలు 49 లక్షల యూజర్లు లాస్
ఇది గ్యాలరీలో ఉన్న ఫోటోలతో మిమిస్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు . అలాగే మెమెస్‌లతో పాటు వాటికి టెక్స్ట్, ఎఫెక్ట్స్ మరియు ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫేస్‌బుక్ కొత్త యాప్ ప్రయోగం (ఎన్‌పిఇ) బృందం వేల్ యాప్ ని అభివృద్ధి చేసింది.
వేల్ యాప్ NPE యొక్క కొత్త ప్రయోగాత్మక యాప్. ఇది ప్రస్తుతం కెనడా దేశంలో మాత్రమే ప్రారంభించబడింది. ఈ యాప్ ఉపయోగించడానికి ఎలాంటి చెల్లింపూలు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇది పూర్తి ఉచితం. వినియోగదారులు రియల్-టైమ్ ఫోటోలను స్నాప్ చేయవచ్చు. వారు నచ్చిన విధంగా ఇమోజిలు, ఫిల్టర్లు మరియు పాపులర్ ఎఫెక్ట్స్ జోడించి మరింత హాస్యంగా మార్చవచ్చు.
also read IT layoffs: ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు...ఎందుకంటే ?
ఈ క్రియేషన్స్‌ను సేవ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయవచ్చు.వేల్ యాప్ లో టు-గ్రిడ్, త్రీ-గ్రిడ్, ఫోర్-గ్రిడ్ లేదా బ్లాంక్ కాన్వాస్ లేఅవుట్లు, ఫ్రీఫార్మ్ డ్రా టూల్, ఇమోజీలు మరియు స్టిక్కర్ ఆప్షన్ లు, లేజర్ ఐస్, వర్టెక్స్, బుల్జ్ ఇంకా మరెన్నో ఆప్షన్స్ ఉన్నాయి.
ప్రజలు ఇష్టపడే కొత్త ఫీచర్లను కనుగొనడంలో కంపెనీకి ఎంతో కృషి చేసిందని ఫేస్‌బుక్ సమాచార నివేదిక పేర్కొంది. ఇది కేవలం కెనడా లోనే విడుదలను చేశాము ఇది పూర్తిగా టెస్టింగ్ యాప్. ప్రస్తుతం ఈ యాప్ కెనడియన్ యాప్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.