చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం రియల్‌మీ కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఇటీవలే బ్లాక్ ఫ్రైడే పేరిట డిస్కౌంట్లు అందించిన ఆ కంపెనీ తాజాగా ‘వింటర్ సేల్ ’ సేల్ ప్రారంభించింది.
న్యూఢిల్లీ: చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం రియల్‌మీ కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఇటీవలే బ్లాక్ ఫ్రైడే పేరిట డిస్కౌంట్లు అందించిన ఆ కంపెనీ తాజాగా ‘వింటర్ సేల్ ’ సేల్ ప్రారంభించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైన ఈ సేల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది.
రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ సీ2, రియల్ ఎక్స్, రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ 3 ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది. రియల్ మీ ‘వింటర్ సీజన్’లో రియల్‌మీ 5 ప్రో ఫోన్‌ను రూ.12,999కే విక్రయిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.13,999 ఉండగా.. రూ.1000 తగ్గించి విక్రయిస్తోంది.
also Read: విపణిలోకి వివో మరో పంచ్ హోల్ సెల్ఫీ ఫోన్.. ధరెంతంటే?
రియల్‌మీ సీ2 (2జీబీ/32జీబీ) ఫోన్ ధరను రూ.6,999 నుంచి రూ.5,999లకు, రియల్‌మీ ఎక్స్ ధరను రూ.1000 తగ్గించి రూ.15,999కే అందిస్తోంది. ఇక రియల్ మీ 3 ప్రో ధరను 12,999 నుంచి రూ.9,999కు తగ్గించింది.
రియల్‌మీ 3 ఫోన్ రూ.7,999లకే లభిస్తుంది. గతంలో దీని ధర రూ.8,999గా ఉండేది. ఇంకా అదనంగా రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ 3, రియల్‌మీ 3ఐ ఫోన్లు కొనుగోలుపై రూ.1000 కూపన్ అందిస్తోంది.
రియల్ మీ అందించే ఈ కూపన్‌ను ఇతర ప్రొడక్టుల కొనుగోలుకు వినియోగించు కోవచ్చు. క్యాషిఫై ద్వారా ఎక్స్ఛేంజ్‌పై కొనుగోలుపై రూ.500 అదనంగా పొందొచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ కార్డులపై జీరో ఈఎంఐ వసతి కల్పిస్తోంది.
Also Read: ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లో రేటింగ్స్ & రివ్యూస్ కనిపించవు...ఎందుకంటే..?