వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. వివో 'వీ17' ప్రోకి కొనసాగింపుగా.. 'వీ17' పేరుతో ఈ మోడల్‌ను విడుదల చేయనుంది.
భారత మార్కెట్లోకి వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. వివో 'వీ' శ్రేణిలో కొత్త ఫోన్‌ను తేనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మీడియా సంస్థలకు ఆహ్వానాలు పంపింది. వీటి ప్రకారం డిసెంబర్ 9వ తేదీన వివో 'వీ17' పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం అవుతోంది.
సెప్టెంబర్‌లో వచ్చిన వివో 'వీ17 ప్రో'కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి ఆ సంస్థ తీసుకు రానున్నది. 'వీ17' గురించి పెద్దగా వివరాలేవి బయటికి వెల్లడించలేదు. అయితే 'వీ17' పేరుతో రష్యాలో కొత్త మోడల్‌ను వివో విడుదల చేసింది.
Also read:డిసెంబర్ 10న రెడ్మీ '5జీ' స్మార్ట్‌ఫోన్ లాంచ్... రెండు కొత్త ఫీచర్లతో...
భారత్‌లో విడుదలయ్యే 'వీ17' మోడల్‌కు రష్యా మోడల్‌కు కొన్ని ఫీచర్లు మినహాయించి.. చాలా వ్యత్యాసం ఉండనున్నది. ఎందుకంటే రష్యాలో విడుదలైన 'వీ 17' మోడల్‌కు టియర్ డ్రాప్ నాచ్ సెల్ఫీ కెమెరా ఉంది.
భారత్‌లో విడుదలయ్యే 'వీ 17' మోడల్ వివో 'జెడ్1' ప్రో మాదిరే పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన టీజర్ ద్వారా తెలిసింది. రష్యాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే.. ఇంకా ఎక్కువ ఫీచర్లు ఉండొచ్చని టెక్వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ప్రీమియం సెగ్మెంట్లో వస్తున్న ఈ మోడల్ ధర భారత్‌లో రూ.22 వేలు ఉంటుందని అంచనా. ఈ ఫోన్ 6.38 అంగుళాల డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమ్లోడ్ డిస్‌ప్లేతోపాటు 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది.
Also Read:మార్కెట్లోకి విడుదలైన ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే ?
స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌తోపాటు బ్యాకప్ నాలుగు కెమెరాలు (48 ఎంపీ+ 8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)తోపాటు 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‌పై పని చేస్తుంది.