నోకియా నుండి తొలి స్మార్ట్ టీవీ: ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్

By Sandra Ashok Kumar  |  First Published Dec 6, 2019, 11:31 AM IST

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌తో ఈ -రిటైలర్ ఫ్లిప్ కార్ట్ విపణిలోకి స్మార్ట్ టీవీ తేనున్నది. జేబీఎస్ ఆడియో టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా కల ఈ టీవీ ధర రూ.41,999గా నిర్ణయించారు. భవిష్యత్‌లో మరిన్ని స్మార్ట్ టీవీలను తీసుకు రానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.


న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం నోకియా విపణిలోకి తాజాగా తొలి స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ రూపొందించిన ఈ టీవీ 55 అంగుళాల 4కే యూహెచ్డీ స్క్రీన్‌తో వస్తున్నది. ఈ స్మార్ట్ టీవీలో జేబీఎల్ ఆడియో టెక్నాలజీ వినియోగించడం ప్రధాన ఆకర్షణ. దీని ధరను రూ.41,999గా ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ నెల 10వ తేదీ నుంచి దీని అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభం కానున్నాయి. టీవీతోపాటు స్టాండ్, వాల్మౌంట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన బ్లూటూత్ రిమోట్ అందిస్తోంది. 

also read సంపన్నుల కోసం శామ్‌సంగ్ లగ్జరీ టీవీలు...ధర ఎంతంటే ?

Latest Videos

undefined

ప్రారంభ ఆఫర్ కింద ప్రీ పెయిడ్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది నోకియా. రూ.999లకే మూడేళ్ల టీవీ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తున్నారు. 55 అంగుళాల 4కే యూహెచ్డీ స్క్రీన్ గల ఈ టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్, డాల్బీ విజన్ సపోర్ట్, ఇంటిలిజెంట్ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌తో పని చేసే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. 2.25 జీబీ ర్యామ్ విత్ 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు (2.0, 3.0) ఉన్నాయి. వై-ఫై, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ వసతులు ఉన్నాయి. 

also read జియో ప్లాన్ ధరలు పెంపు...రేపటి నుంచే అమలు

24 వాట్ల జేబీఎల్ స్పీకర్ కల ఈ స్మార్ట్ టీవీ డీటీఎస్ ట్రూసరౌండ్, డాల్బీ ఆడియో ఫీచర్లు ఇంట్లో కొత్త అనుభూతిని తెస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. భవిష్యత్లో నోకియా బ్రాండ్పై మరిన్ని స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నది. విక్రయం తర్వాత సేవలు, రిపేర్లు, మెయింటెనెన్స్ సేవలు అందించే జీవ్స్ ద్వారా లభిస్తాయన్నది. ఫర్నీచర్ ఇన్స్టలేషన్ ఇతర సేవల కోసం జీవ్స్ సేవలను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే వినియోగిస్తున్నది.

click me!