జియో ప్లాన్ ధరలు పెంపు...రేపటి నుంచే అమలు

By Sandra Ashok Kumar  |  First Published Dec 5, 2019, 5:29 PM IST

భారతదేశంలో  రిలయన్స్  జియో కస్టమర్ల కోసం డిసెంబర్ 6 నుంచి కొత్త ‘ఆల్ ఇన్ వన్’  ప్లాన్ లను అమల్లోకి తేనుంది. జియో కొత్త రిచార్జ్ ప్లాన్లు రూ.129 నుంచి రూ. 2,199 వరకు ప్లాన్ లను ప్రవేశపెట్టింది.


ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపు తరువాత రిలయన్స్ జియో తన  ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను వెల్లడించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు 39 శాతం వరకు పెరిగాయని తెలిపింది. భారతదేశంలో  రిలయన్స్  జియో కస్టమర్ల కోసం డిసెంబర్ 6 నుంచి కొత్త ‘ఆల్ ఇన్ వన్’  ప్లాన్ లను అమల్లోకి తేనుంది. జియో కొత్త రిచార్జ్ ప్లాన్లు రూ.129 నుంచి రూ. 2,199 వరకు ప్లాన్ లను ప్రవేశపెట్టింది.

also read అలాంటి పోస్టులను పరిమితం చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

Latest Videos

undefined

డిసెంబర్ 3వ తేదీ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్స్ ప్లాన్లను పెంచాయి. అయితే 6వ తేదీ నుంచి రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్  ప్లాన్లను ప్రవేశపెట్టబోతుంది. 

రూ.199 రీఛార్జితో ప్రతి రోజు 1.5GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 మెసేజులు,  జియో నుంచి జియో ఆన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, ఇతర నెట్ వర్క్స్‌కు నెలకు 1,000 నిమిషాల కాల్స్, వ్యాలిడిటీ 28 రోజులు.
 

also read  ఇక అక్కడ సిమ్ కొనలంటే ఫేస్ స్కాన్ తప్పనిసరి...


రూ.399 రీఛార్జితో జియో నుంచి జియో ఆన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, ఇతర  నెట్ వర్క్స్‌కు 2,000 నిమిషాల టాక్ టైమ్, వాలిడిటీ 84 రోజులు.   

రూ.555 రీఛార్జితో జియో నుంచి జియో ఆన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, ఇతర  నెట్ వర్క్స్‌కు 3,000 నిమిషాల టాక్ టైమ్, వాలిడిటీ  84 రోజులు, 

రూ.1,299 రీఛార్జితో జియో నుంచి జియో ఆన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకు 100 మెసేజులు,ఇతర  నెట్ వర్క్స్‌కు 12,000 నిమిషాల టాక్ టైమ్,  ఒక సంవత్సరం పాటు వాలిడిటీ. 
 

click me!