రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? అన్నట్లు సంపన్నులు కావాలనుకుంటే కొండమీద కోతైనా దిగి వస్తుంది. సంపన్నుల అభిరుచులకు అనుగుణంగా వారికి దగ్గరయ్యేందుకు శామ్ సంగ్ ఇండియా లగ్జరీ టీవీలను అందుబాటులోకి తేనున్నది. దీని ధర రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు అంచనా.
న్యూఢిల్లీ: విలాస వసతులు కోరుకునే సంపన్నులే లక్ష్యంగా శామ్సంగ్ ఇండియా ఓ సరికొత్త ఎల్ఈడీ స్క్రీన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నది. రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధరతో మూడు సైజులలో ఈ డిస్ప్లేలను అందుబాటులోకి తేనున్నట్లు శామ్సంగ్ వెల్లడించింది.
ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. సరికొత్త మాడ్యులర్ మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే 'ది వాల్'ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. జాయింట్ స్క్రీన్‌తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్ప్లేలను మార్కెట్లోకి తేనున్నట్లు శామ్సంగ్ ప్రకటించింది.
undefined
also read ఇక అక్కడ సిమ్ కొనలంటే ఫేస్ స్కాన్ తప్పనిసరి...
ఈ టీవీల ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు శామ్సంగ్ పేర్కొంది. లగ్జరీ స్క్రీనింగ్ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్ప్లేను పరిచయం చేసినట్లు శామ్సంగ్ తెలిపింది.
2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్సంగ్ ఇండియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఉపాధ్యక్షుడు పునీత్ సేతి తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్లు, 950 మంది మల్టీ మిలియనీర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ స్క్రీన్లకు మెట్రో, నాన్ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్ ఉండొచ్చని శామ్సంగ్ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్, ఛండీగఢ్‌ల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తోంది.
ది వాల్ 146 అంగుళాల డిస్ప్లే.. మైక్రో ఎల్ఈడీ సదుపాయంతో లభించనుంది.219 అంగుళాల డిస్ప్లే, 6కే డెఫినిషన్తో, 292 అంగుళాల డిస్ప్లే 8కే డెఫినిషిన్తో రూపొందిస్తున్నారు. ది వాల్‌తో వినియోగదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని స్క్రీన్ అనుభూతి పొందుతారని శామ్సంగ్ చెబుతోంది.
also read బెస్ట్ కెమెరా ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్ఫోన్లపై ఓ లూక్కెయండి...
ఈ డిస్ప్లేలలో 0.8 ఎంఎం పిక్సెల్ పిఛ్ టెక్నాలజీ పొందుపరిచినట్లు తెలిపింది. దీని ద్వారా సినిమా, వీడియోలలో లగ్జరీ వినియోగదారులు అనుభూతి పొందుతారని శామ్సంగ్ పేర్కొంది. అన్ని రకాల ఓఎస్‌లకు ది వాల్ అనుకూలంగా ఉండనున్నట్లు శామ్సంగ్ తెలిపింది.
ది వాల్ ప్రొఫెషనల్ వెర్షన్‌ను అందుబాటులోకి తేనుంది శామ్సంగ్. పెద్ద పెద్ద వ్యాపారాలకు, రిటైలర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇది పూర్తి కస్టమైజబుల్ ఫీచర్లతో రానున్నట్లు పేర్కొంది.ది వాల్‌ను పూర్తిగా ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించినట్లు శామ్సంగ్ వెల్లడించింది. ఎక్కువ సమయం వాడకపోతే ఇంటీరియర్‌కు తగ్గట్లు సీనరీలు, ఆర్ట్‌ల వంటివి డిస్ప్లే అవుతూ ఉంటాయని తెలిపింది.