నేడే మోటో జి8 ప్లస్ విడుదల ....అదిరిపోయే ఫీచర్స్

By Ashok Kumar  |  First Published Oct 24, 2019, 12:37 PM IST

మోటో జి8 ప్లస్ ఈ రోజు  నేడు విడుదల కానుంది దాని గురించి కంపెనీ అన్ని వివరాలను వెల్లడిస్తుంది.


మోటో జి8 ప్లస్ ఈ రోజు  నేడు విడుదల కానుంది దాని గురించి కంపెనీ అన్ని వివరాలను వినియోగదారులకు వెల్లడిస్తుంది.

మోటో జి8 ప్లస్ ధర
మోటో జి8 ప్లస్ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు, అయితే  మోటో జి 7 ప్లస్ EUR 299.99 (సుమారు రూ. 23,600) ధరతో ప్రారంభించబడింది, అదే శ్రేణిలో భారతదేశంలో మోటో జి8 ప్లస్ ధర రూ. 19.999ధర నిర్ణయించబడటం లేదా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. లెనోవా యాజమాన్యంలోని బ్రాండ్ ఈ రోజు మోటో జి 8 ప్లే, మోటో జి 8, మోటో ఇ 6 ప్లే ఫోన్‌లను కూడా  లాంచ్ చేస్తున్నారు.

Latest Videos

undefined

also read విపణిలోకి రియల్ మీ ఎక్స్ మీ ప్రో.. డిసెంబర్‌లో భారత్‌లోకి..

మోటో జి8 ప్లస్ డిజైన్ 
మోటో జి8 ప్లస్ యొక్క  ట్రిపుల్ కెమెరా సెటప్, గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్, వాటర్‌డ్రాప్-స్టైల్ , వెనుక వేలిముద్ర సెన్సార్‌,  డ్యూయల్ రియర్ ఎండ్ స్పీకర్లు, యుఎస్బి టైప్-సి పోర్ట్ మరియు కుడి అంచున వాల్యూమ్ మరియు పవర్ బటన్లను కలిగి ఉంటుంది. ఫోన్ బ్లూ మరియు రెడ్ గ్రేడియంట్లో అందుబాటులోకి రానున్నది, అయితే ఇది మరిన్ని రంగులలో తరువాత  లభ్యం కావొచ్చు .

మోటో జి8 ప్లస్ స్పెసిఫికేషన్స్
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇటీవల మోటో జి 8 ప్లస్ ఆండ్రాయిడ్ 9 పై నడుస్తుందని మరియు 6.3-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1080x2280 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో జతచేయబడిన స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా-కోర్ సోసీ ద్వారా శక్తినిస్తుందన్నారు. ఇన్ బిల్ట్  స్టోరేజ్  64GB మరియు 128GB ఎంపికలలో లభ్యంకానుంది మరియు మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరణకు సహకరిస్తుంది.

also read స్మార్ట్ ఫోన్లలో కెమెరాల వార్ మొదలైంది

కెమెరా విషయానికొస్తే, మోటో జి 8 ప్లస్ 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్, 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో 117 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ఉంటుందని అంచనా. లేజర్ ఆటోఫోకస్ సిస్టమ్ కోసం ఫోకస్ ఖచ్చితమైన మరియు ఫాస్ట్ గా  ఉండటానికి అనుమతిస్తుంది. ఫ్రంట్ కెమెరా 25 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ప్యాక్ అమర్చారు. 

మోటో జి 8 ప్లస్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఇది 3.5 ఎంఎం ఆడియో జాక్,  బ్లూటూత్ వి 5 కనెక్టివిటీ, ఎల్‌టిఇ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, వైర్‌లెస్ లాన్, ఎల్‌టిఇ క్యాట్ 13, డ్యూయల్ బ్యాండ్ వై-ఎఫ్‌ఐ, ఎన్‌ఎఫ్‌సి మరియు మరెన్నో ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 188 గ్రా, 9.1 మిమీ మందంగా ఉంటుంది.

click me!