స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త...తెలిస్తే షాక్ అవుతారు

By Ashok KumarFirst Published Oct 24, 2019, 9:43 AM IST
Highlights

స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. తాజాగా గెలాక్సీ ఎ80 ఫోన్ ధరను రూ.8000 తగ్గించి వేసింది. జూలైలో భారతదేశ మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ అసలు ధర రూ.47,990 కాగా, తగ్గింపు ధరతో రూ. 39,990లకే లభ్యం కానున్నది.
 

ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్‌ తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపు ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 8వేల తగ్గింపుతో  గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను రూ.39,990కే విక్రయిస్తోంది.  ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ తరువాత జూలైలో భారతదేశంలో విడుదలైంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 47,990గా నిర్ణయించారు.  

also read ఐదు కెమెరాలు! త్వరలో మార్కెట్లోకి నోకియా 9 ప్యూర్‌వ్యూ

డబుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో 48ఎంపీ భారీ కెపాసిటీ రొటేటింగ్‌ కెమెరా ప్రత్యేక ఫీచర్‌గా వచ్చిన ఏ80 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సెటప్‌ను రెండు వైపులా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫీలకు అనుగుణంగా  కెమెరాలో సెల్ఫీ మోడ్‌ను ఎంచుకుంటే  ఇది ఆటోమ్యాటిక్‌గా తిరుగుతున్నది. ప్రస్తుతం శామ్‌సంగ్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

also read బడ్జెట్‌ ధరలో విపణిలోకి రియల్‌మీ 3ఐ

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 80 ఫోన్‌లో  6.7 అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లేతోపాటు 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ సౌకర్యం ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 పై ఈ ఫోన్ పని చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ సాక్‌తోపాటు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా + 8 ఎంపీ 123డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌లో 3700 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఉంది. 

click me!