కోవిడ్ కష్టకాలంలో వినియోగదారులంతా కూడా మరీ ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలకు చెందినవారు అందుబాటు ధరలకే ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండగలగాలని జియో కోరుకుంటున్నది.
ముంబై, 14 మే 2021: ప్రతీ భారతీయుడికీ డిజిటల్ జీవితం అందించాలనే ఆశయంతో జియోఫోన్ ప్రారంభమైంది. కోవిడ్ కష్టకాలంలో వినియోగదారులంతా కూడా మరీ ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలకు చెందినవారు అందుబాటు ధరలకే ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండగలగాలని జియో కోరుకుంటున్నది.
ఇందుకు వీలు కల్పించేలా ఈ కరోనా సమయంలో జియో రెండు ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించింది:
undefined
1. ఈ మహమ్మారి సమయమంతా కూడా, రీచార్జ్ చేసుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ (రోజుకు 10 నిమిషాలు) కు రిలయన్స్ ఫౌండేషన్ వీలు కల్పించేలా జియో కృషి చేస్తోంది.
2. అదనంగా, అందుబాటును మరింత పెంచేందుకు, జియోఫోన్ వినియోగదారు చేసుకునే ప్రతీ జియోఫోన్ ప్లాన్ తో వారు అంతే విలువ గల అదనపు రీచార్జ్ ప్లాన్ ను ఉచితంగా పొందగలుగుతారు. ఉదాహరణకు జియో ఫోన్ యూజర్ రూ.75 ప్లాన్ తో రీచార్జి చేయించుకుంటే, అదనంగా రూ.75 ప్లాన్ ను పూర్తిగా ఉచితంగా పొందగలుగుతారు.
ఈ సవాళ్ల సమయంలో ప్రతీ భారతీయుడి పక్షాన నిలబడేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది. ఈ మహమ్మారి సృష్టించిన కష్టాలను తోటి పౌరులు అధిగమించేందుకు తనకు చేతనైన సాయం చేయడాన్ని కొనసాగించనుంది.
రిలయన్స్ ఫౌండేషన్ యొక్క కోవిడ్ ప్రయత్నాలు గురించి:
కోవిడ్- 19పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. కోవిడ్ -19 తో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొల గించేందుకు నిర్విరామంగా ప్రయత్నించింది. వారు వేగంగా కోలుకునేందుకు సహాయపడింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు...అన్నిటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది.
also read మూడు మైక్రోఫోన్లతో షియోమి కొత్త ఇయర్‌బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 28 గంటల బ్యాకప్.. ...
భారతదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌం డేషన్ ముందువరుసలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ మొట్టమొదటి కోవిడ్ -19 కేర్ హాస్పిటల్ ను కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ లలో బెడ్స్ సంఖ్యను 100 నుంచి 2.325 కు పెం చింది. ఇంటెన్సివ్, స్పెషల్ కేర్, ట్రీట్ మెంట్, ఐసొలేషన్ సదుపాయాలు వీటిలో ఉన్నాయి.
రిలయన్స్ ఫౌండేషన్ మిషన్ అన్నా సేవను ప్రారంభించింది. ప్రపంచంలో ఓ కార్పొరెట్ ఫౌండేషన్ చేపట్టిన అతిపెద్ద భోజన పంపిణి కార్యక్రమం ఇది. రిలయన్స్ ఫౌండేషన్ 200 భాగస్వామ్య సంస్థల ద్వారా కిరాణా కిట్స్, వండిన భోజనం, టోకుగా రేషన్ ను అందిస్తోంది. ఇప్పటి వరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్లకు పైగా భోజనాలను సమకూర్చింది.
ఎలాంటి అంతరాయాలు లేకుండా అత్యవసర సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నోటిఫైడ్ వాహనాలకు, అంబులెన్స్ లకు రిలయన్స్ ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తోంది. రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది భారతదేశ ఆక్సీజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ రవాణాను సులభతరం చేసేందుకు గాను రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది.
For further information, please contact:
Reliance Jio Infocomm
Jio.CorporateCommunication@ril.com
022-44753591